Virat Kohli: కళ్లకు గంతలతో టార్గెట్ ఛేదించిన కోహ్లీ.. ట్రెండ్ అవుతున్న కోహ్లీ వీడియో..
ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9 న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో
ఫిబ్రవరి 9 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9 న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ కళ్లకు గంతలు కట్టుకుని బ్యాటింగ్ చేశాడు. అంతే కాకుండా కళ్లకు గంతలు కట్టినా లక్ష్యాన్ని చేధించి షాక్ ఇచ్చాడు మాజీ కెప్టెన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను పెద్దసంఖ్యలో లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. అంతేకాదు కోహ్లీని బాబర్ ఆజంతో పోల్చుతున్నారు. అయితే బాబర్ ఆజం ఎప్పటికీ అలా చేయలేడని కామెంట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకూ నాగ్‌పూర్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఢిల్లీలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మూడో టెస్టు మార్చి 1 నుంచి మార్చి 5 వరకు ధర్మశాలలో జరగనుంది. అదే సమయంలో మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డే ముంబైలో, రెండో వన్డే విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరగనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..