Mohammed Shami: షమీ దెబ్బకు గాల్లో పల్టీలు కొట్టిన స్టంప్..! ఇదే హైలైట్ వీడియో.

|

Mar 18, 2023 | 6:26 PM

టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ తన స్పీడ్‌ దెబ్బను ఆసీస్‌ యువ బ్యాటర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌కు రుచిచూపించాడు. నాలుగో టెస్టు తొలి రోజు షమీ పడగొట్టిన హ్యాండ్స్‌కాంబ్‌ వికెట్‌ హైలెట్‌గా నిలిచింది.

టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమీ తన స్పీడ్‌ దెబ్బను ఆసీస్‌ యువ బ్యాటర్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌కు రుచిచూపించాడు. నాలుగో టెస్టు తొలి రోజు షమీ పడగొట్టిన హ్యాండ్స్‌కాంబ్‌ వికెట్‌ హైలెట్‌గా నిలిచింది. అహ్మదాబాద్‌లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో మహ్మద్ షమీ తన అద్భుతమైన బంతితో పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు చెందిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని తన బంతితో షాక్‌కి గురిచేశాడు. ఈ అద్భుతమైన బంతికి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టాడు. బంతి వేగానికి వికెట్ చాలా సేపు గాలిలో ఎగురుతూ వెళ్లినట్లు కనిపించింది. ఈ అద్భుతమైన బంతిని చూసిన ఆస్ట్రేలియా బ్యాటర్ కూడా అవాక్కాయ్యాడు. నెటిజన్లు కూడా ఇలాంటి బంతి అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మహమ్మద్ షమీ అద్భుతమైన బంతి వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అహ్మదాబాద్ టెస్టు తొలిరోజు హ్యాండ్స్‌కాంబ్‌లానే మహ్మద్ షమీ మార్నస్ లాబుషెన్ స్టంప్‌లను చెదరగొట్టాడు. షమీ ఇన్‌స్వింగ్‌ను మిస్ అవ్వడంతో హ్యాండ్స్‌కాంబ్‌ వికెట్ కోల్పోయాడు. బంతి అతని బ్యాట్ లోపలి అంచుని తీసుకొని లెగ్ స్టంప్‌ను పడగొట్టింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్ జరిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 18, 2023 06:26 PM