Rohit Sharma: నవ్వులు పూయించిన రోహిత్ మతి మరుపు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..!
రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తన నవ్వులు తెప్పించింది. టాస్ గెలిచిన అతను ఏం ఎంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోయాడు.
రాయ్‌పుర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. టాస్ వేసే సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రవర్తన నవ్వులు తెప్పించింది. టాస్ గెలిచిన అతను ఏం ఎంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోయాడు. రిఫరీ జవగళ్ శ్రీనాథ్ అడిగితే రోహిత్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కొద్దిసేపు తటపటాయించి.. బుర్ర గోక్కున్నాడు. టాస్ గెలిస్తే ఏం చేయాలని జట్టుతో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకోవడం కోసం అతను కాస్త తత్తరపాటుకు గురయ్యాడు. కొన్ని క్షణాలు ఆలోచించి.. ఆ తర్వాత బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో ప్రత్యర్థి కెప్టెన్ లేథమ్, శ్రీనాథ్, వ్యాఖ్యాత రవిశాస్త్రి నవ్వుకున్నారు. రోహిత్ కూడా వీళ్లతో కలిసి నవ్వాడు. ఆ సమయంలో మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సిరాజ్, షమితో పాటు భారత ఆటగాళ్లు కూడా నవ్వులు చిందించారు. ‘‘టాస్ గెలిస్తే ఏం చేయాలి అనే విషయంపై జట్టులో బాగా చర్చించాం. కానీ తీసుకున్న నిర్ణయాన్ని కాసేపు మర్చిపోయా. కఠిన పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కోవాలని అనుకున్నాం. మొదట బౌలింగ్ చేస్తాం’’ అని రోహిత్ చెప్పాడు. అతని మాటలను బట్టి చూస్తే బ్యాటింగ్‌కు బదులు బౌలింగ్ ఎంచుకున్నాడేమో అనిపించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..