Nara Lokesh – Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్ హౌస్ ను చూపించిన నారా లోకేష్..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు.. గుడ్ మార్నింగ్ మహానటుడు.. అంటూ నారా లోకేశ్.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం నిర్వహిస్తారని, నిజాయతీగా ఉండాలంటూ ఉద్యోగులకు నీతులు చెబుతుంటారని కానీ చేసే పనులు అలా ఉండవంటూ విమర్శించారు. అందరికీ నీతిని బోధించే ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం గుట్టలు ఆక్రమించుకుంటారని లోకేశ్ ఆరోపించారు.ఎర్రగుట్టను కబ్జా చేసిన కేతిరెడ్డి విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మించుకున్నారంటూ నారా లోకేష్ పేర్కొన్నారు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే విలాసాలకు అడ్డా అని లోకల్ గా టాక్ వినిపిస్తోందని అన్నారు. 902, 909 సర్వే నెంబర్లలో 20 ఎకరాలను ఆక్రమించారని వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..