Big News Big Debate: మా అమ్మ, నేను కూడా పవన్ ఫ్యాన్సే : ఆర్జీవీ
వర్మ అంటేనే వివాదం. సహజంగా ఎవరైనా వివాదాలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఈయన మాత్రం కావాలని కొని తెచ్చుకుంటారు. ఆయన ఏది చేసినా సెన్సేషన్ అయి కూర్చుటుంది. తాజాగా సీఎం జగన్ బయోపిక్ వ్యూహంతో వార్తల్లో నిలిచారు వర్మ. ఈ సినిమాకు సంబంధించి పలు అంశాలపై టీవీ9కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అవన్నీ పక్కనబడితే.. తెలుగు రాష్ట్రల్లో హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ను వర్మ పదే, పదే ఎందుకు టార్గెట్ చేస్తారు. పవన్‌తో వైరం ఏంటి..? పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై వర్మ ఏమంటున్నారు..
వ్యూహం సినిమా వెనక ఉన్నది ఎవరు..? పవన్‌ను వర్మ పదే, పదే ఎందుకు టార్గెట్ చేస్తారు. ఆయనతో వర్మకు ఏదైనా శత్రత్వం ఉందా..?.. ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా లేవనెత్తారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. వాటికి తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు దర్శకుడు ఆర్జీవీ. ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనరలైజ్ చెయ్యొద్దన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన్ను అభిమానించేవారు చాలామంది ఉంటారన్నారు. తన అమ్మతో పాటు తాను కూడా పవన్ ఫ్యానే అన్నారు ఆర్జీవీ. పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యేందుకే తాను పోస్టులు పెడతానని పేర్కొన్నారు వర్మ.
Published on: Aug 16, 2023 09:32 PM