Gayathri Gupta: 5 ఏళ్ల కంటే ఎక్కువ బతకనని చెప్పారు.. చనిపోవడమే నయమనిపించింది.

|

Aug 24, 2023 | 8:43 PM

నటి గాయత్రి గుప్తా యాంకర్‌గా కొంతకాలం తర్వాత షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ ఫేమస్‌ అయింది. ఐస్‌క్రీమ్‌ 2, ఫిదా, మిఠాయి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, కొబ్బరిమట్ట చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్‌ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

నటి గాయత్రి గుప్తా యాంకర్‌గా కొంతకాలం తర్వాత షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ ఫేమస్‌ అయింది. ఐస్‌క్రీమ్‌ 2, ఫిదా, మిఠాయి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, కొబ్బరిమట్ట చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్‌ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. పాతికేళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేశానంది. తనకు యాంక్లోసింగ్‌ స్పాండిలైటిస్‌ ఉందని పదేళ్లపాటు బెడ్‌ రెస్ట్‌ లో ఉందని ఇది డిప్రెషన్‌ వల్ల వచ్చే శారీరక వ్యాధి అని తెలిపింది. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం బతకనని మూడేళ్ల కిందట డాక్టర్స్‌ చెప్పారట. ఇంజక్షన్స్‌ వేసుకోకపోతే కదలడానికి కూడా కష్టమయ్యేదని అలాగే విపరతీమైన బ్యాక్‌ పెయిన్‌ ఉండేదని పెయిన్‌ కిల్లర్‌ వేసుకున్న ప్రతిసారి తనకు గుండెదడ వస్తుందని చెప్పింది. డాక్టర్స్‌ తాను చనిపోతానని చెప్పినప్పుడు ఈ నొప్పి భరించడం కంటే అదే నయం అనుకుందట. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంటే బతుకుపై ఆశ కలుగుతోందని తెలిపింది. సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చిందని సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నానని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్త.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...