Viral: 10 ఏళ్ల బాలిక తన కడుపును తాకగా.. తగిలిన బలమైన వస్తువు.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా..

పిల్లలను కనిపెట్టుకు ఉండాలి. వారు బయటకు బానే ఉన్నా, మనసులో సంఘర్షనకు లోనైతూ ఉంటారు. పలు రకాలు మానసిక సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.

Viral: 10 ఏళ్ల బాలిక తన కడుపును తాకగా.. తగిలిన బలమైన వస్తువు.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా..
X Ray
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 30, 2023 | 4:12 PM

ముంబైలో ఓ అరుదైన మెడికల్ కేసు వెలుగుచూసింది. ఓ 10 ఏళ్ల బాలిక తన కడుపును తాకినప్పుడు.. ఏదో బలమైన వస్తువు చేతికి తగిలినట్లు అనిపించింది. దీంతో భయంతో బాలిక విషయాన్నితల్లికి చెప్పింది. దీంతో అప్రమత్తమైన తల్లి.. కుమార్తెను వెంటనే బాయి జెర్‌బై వాడియా చిల్డ్రన్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ CT స్కాన్‌ చేశారు వైద్యులు. రిపోర్టు చూసి లోపల ఉన్నది వెంట్రుకల ముద్ద అని గ్రహించారు. బాలిక ట్రైకోటిల్లోమానియా ( తన వెంట్రుకలు తీనాలనే బలమైన కోరిక ఏర్పడే పరిస్థితి) వ్యాధి ఉందని గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేశారు వైద్యులు. 2 గంటల శస్త్రచికిత్స అనంతరం బాలిక కడుపు నుంచి.. 100 గ్రాముల హెయిర్‌బాల్‌ను విజయవంతంగా తొలగించారు. బాలిక పరిస్థితి బానే ఉండటంతో.. 7 రోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.

ముంబైలోని దాదార్ ప్రాంతానికి చెందిన  బాధితురాలు 9 సంవత్సరంలోనే మోచ్యూర్ అవ్వడంతో..  అప్పటి నుంచి పీరియడ్స్ మందులు తీసుకుంటోంది. తను ఈ సంవత్సర కాలం పాటు కడుపు నొప్పితో పాటు భారీ రక్తస్రావంతో ఇబ్బందిపడింది. దీంతో దగ్గర్లోని వైద్యులను సంప్రదించగా.. వారు ఇది రుతుక్రమానికి సంబంధించిన సమస్యగా భావించి మెడిసిన్ ఇచ్చి పంపేశారు.  అయితే ఈ సమస్యలు ఆమె దినచర్యకు అంతరాయం కలిగించలేదు. వాంతులు,  బరువు తగ్గడం వంటి ఇతర సంకేతాలు లేదా లక్షణాలు కూడా లేకపోవడంతో ఎలాంటి అనుమానం రాలేదు. ఆమె తిన్న వెంట్రుకలు కొంతకాలానికి కడుపులో వెంట్రుకలు ముద్దలా పేరుకుపోవడంతో.. లోపల ఏదో ఉన్నట్లు ఆ బాలికకు అర్థమైంది. వెంటనే తన తల్లికి విషయం చెప్పడంతో.. అంతా సాఫీగా జరిగిపోయిందని.. డాక్టర్లు చెప్పారు.

“నా కుమార్తె అడపాదడపా కడుపు నొప్పిని ఎదుర్కొంది, అది కాలక్రమేణా తీవ్రమైంది. ఆమెకు మందులు ఇచ్చినా నొప్పి ఆగకపోవడంతో ఆందోళన చెందాం. మేము చాలా మంది వైద్యులను సంప్రదించాము, కానీ వారు ఆమెకు చికిత్స చేయడంలో విఫలమయ్యారు. ఇటీవల కడుపులో వెంట్రుకలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాము. వారి ఇబ్బందని వెంటనే గుర్తించి  చికిత్స చేసిన వాడియా వైద్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి దురదృష్టకర ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని ఇతర తల్లిదండ్రులను నేను కోరుతున్నాను” అని రోగి తల్లి అమిత బన్సల్ (పేరు మార్చాం) చెప్పారు. (Source)

Hairball

Hairball

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..