Viral Video: ట్రక్‌లో కారుని తీసుకెళ్లడం మీరు ఎప్పుడైనా చూశారా!.. షాకింగ్ వీడియో వైరల్

వైరల్ అవుతున్న వీడియోలో ఖాళీగా ఉన్న రహదారిపై మహీంద్రా బొలెరో వేగంగా వెళుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే దాని వెనుక ఒక కారు ఫ్రిజ్ లేదా అల్మారా వంటి వస్తువులు తీసుకుని వెళ్తున్నారనుకుంటే పొరపాటే..

Viral Video: ట్రక్‌లో కారుని తీసుకెళ్లడం మీరు ఎప్పుడైనా చూశారా!.. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2023 | 11:31 AM

దేశీ జుగాడ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మరియు. సోషల్ మీడియాలో ఈ దేశీ జుగాడ్ అందరిని ఆకర్షిస్తుంది. ఎంత కష్టమైన పనినైనా జుగాడ్‌తో సులువుగా చేస్తాం. జుగాడ్ని  ఉపయోగించి తమ పనిని పూర్తి చేయడంలో భారతీయులమైన మనం గొప్ప నిపుణులు. తాజాగా ఒక జుగాడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఇక్కడ పికప్ డ్రైవర్ చేసిన ఫీట్‌ని చూసి మంచి దేశీ జుగాడ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రోడ్డుపై రక రకాల డ్రైవర్లు కనిపిస్తారు..  బలమైన రైడర్లు, ‘హెవీ డ్రైవర్లు’.. ఇలా రకరకాల డ్రైవర్లు కనిపిస్తూనే ఉంటారు. వీరు తమ డ్రైవింగ్ నైపుణ్యంతో ఇతర డ్రైవర్లను ..  రోడ్డుపై నడిచే వ్యక్తులను ఆశ్చర్యపరుస్తారు. ఇప్పుడు మహీంద్రా పికప్ బొలెరో డ్రైవర్ గారడీ చేస్తూ తన వెనుక కారును అమర్చుకున్న ఈ క్లిప్‌ను చూడండి. ఇది ఎప్పుడు, ఎక్కడ అనేది ధృవీకరించబడనప్పటికీ, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా  వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో ఖాళీగా ఉన్న రహదారిపై మహీంద్రా బొలెరో వేగంగా వెళుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే దాని వెనుక ఒక కారు ఫ్రిజ్ లేదా అల్మారా వంటి వస్తువులు తీసుకుని వెళ్తున్నారనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత షాక్ తినాల్సిందే. అంతేకాదు , బొలెరో తీసుకుని వెళ్తుంది..  కారు మరి. కారుని బొలెరో జాగ్రత్తగా అమర్చడమే కాదు.. దానిని ఎక్కడికో తరలిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు కారుని ఎలా అమర్చారు అంటూ చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత బరువైన కారును పికప్‌పై ఎక్కించుకుని డ్రైవర్ హైవేపై నడుపుతున్నాడు.

View this post on Instagram

A post shared by Rajesh Pamecha (@rajpam14)

ఈ వీడియోను రాజేష్ అనే అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అతను ‘నేనే రైడర్..’ అనే క్యాప్షన్‌ను ఇచ్చాడు. 48 వేల మందికి పైగా  ఈ వీడియోను చూశారు. నా జీవితంలో మొదటిసారి అలాంటి దృశ్యాన్ని చూశాను’ అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు మరొకరు.. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..