Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెండు రోజులు దంచికొట్టుడే..

|

Aug 20, 2023 | 8:24 AM

Rain Alert for Telangana and Andhra Pradesh: ఆగస్టు నెల ఫస్టాప్ మొత్తం వాన ఊసే లేదు. సెకండాఫ్‌లో ఓ మోస్తరుగా మొదలై దంచికొడతానంటోది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానాకాలం మళ్లీ మొదలైనట్టైంది. మరో రెండురోజుల పాటు ఇదేవిధంగా వర్షం కొనసాగుతుందని, ఐదురోజుల తర్వాతే పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తెలుగునాట వాతావరణం

Rain Alert for Telangana and Andhra Pradesh: ఆగస్టు నెల ఫస్టాప్ మొత్తం వాన ఊసే లేదు. సెకండాఫ్‌లో ఓ మోస్తరుగా మొదలై దంచికొడతానంటోది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానాకాలం మళ్లీ మొదలైనట్టైంది. మరో రెండురోజుల పాటు ఇదేవిధంగా వర్షం కొనసాగుతుందని, ఐదురోజుల తర్వాతే పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తెలుగునాట వాతావరణం పొడిగా మారుతుందని చెబుతోంది వాతావరణశాఖ. కొంతకాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపు చినుకు సందడి చేస్తోంది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో చాలాచోట్ల భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లాలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అటు.. హైదరాబాద్‌లో తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇదే ముసురు మరో రెండురోజుల పాటు కొనసాగవచ్చు. ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ సహా మొత్తం 13 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది.

అటు.. అల్పపీడన ప్రభావం ఏపీలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్సుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..