సీటు కోసం బీఆర్ఎస్, సీపీఎం మధ్య కోల్డ్ వార్.. హాట్ టాపిక్‌గా మారిన మిర్యాలగూడ..

| Edited By: Vimal Kumar

Nov 03, 2023 | 2:24 PM

Miryalaguda: పొత్తుల వ్యవహారం తేలక ముందే మిర్యాలగూడ వేదికగా బీఆర్ఎస్, సీపీఏం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. టికెట్ తమకే అంటే తమకే అన్న భావనలో ఇరు పార్టీల నేతలు ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక్కప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి.. నామమాత్రంగా ఉనికిని చాటుకుంటున్నాయి కామ్రేడ్ల పార్టీలు. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన సంగతి..

సీటు కోసం బీఆర్ఎస్, సీపీఎం మధ్య కోల్డ్ వార్.. హాట్ టాపిక్‌గా మారిన మిర్యాలగూడ..
Miryalaguda Politics
Follow us on

మిర్యాలగూడ, ఆగస్టు 11: తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగడానికి మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే కామ్రేడ్లు మాత్రం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి నడిచే అవకాశం ఉంది. ఈ పొత్తుల వ్యవహారం తేలక ముందే మిర్యాలగూడ వేదికగా బీఆర్ఎస్, సీపీఏం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. టికెట్ తమకే అంటే తమకే అన్న భావనలో ఇరు పార్టీల నేతలు ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఒక్కప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి.. నామమాత్రంగా ఉనికిని చాటుకుంటున్నాయి కామ్రేడ్ల పార్టీలు. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే పొత్తులను కొనసాగిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌తో పొత్తుకు వామపక్షాలు సై అంటున్నాయి. జిల్లాలో తమకు బలమున్న మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ వంటి స్థానాలపై కమ్యూనిస్టులు కన్నేశారు. బీఆర్ఎస్‌తో పొత్తులు ఎలా ఉన్నా.. తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎంలోని ప్రధాన నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మిర్యాలగూడ స్థానాన్ని సిపిఎం అడుగుతోంది. మిర్యాలగూడ నుంచి మూడు సార్లు గెలిచిన సీపీఏం నేత జూలకంటి రంగారెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్‌తో పొత్తులు తేలకముందే మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి ‘నాడు మిర్యాలగూడను అభివృద్ధి చేసింది మనమే..రేపు అభివృద్ధి చేసేది మనమే’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పొత్తులో భాగంగా తానే బరిలో ఉంటానని రంగారెడ్డి చెబుతున్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు కుదరకపోతే బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోటీ చేస్తామని సీపీఎం నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే మిర్యాలగూడ అసెంబ్లీ నియోజక వర్గం ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మేల్యేగా భాస్కర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన భాస్కర్ రావు.. ఆ తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఎమ్మేల్యేగా భాస్కర్‌రావు గెలిచారు. వచ్చే ఎన్నికలో కూడా తానే పోటీ చేస్తానని.. హ్యాట్రిక్ విజయం సాధిస్తానని భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా తనకే టికెట్ వస్తుందని.. టికెట్ విషయంలో ఢోకా లేదని ముఖ్య నేతలు, కేడర్‌కు చెబుతున్నారు. కానీ ఇరు పార్టీల నేతలు టికెట్ తమదంటే తమదని తెగేసి చెబుతున్నారు. దీంతో పొత్తు కుదరక ముందే మిర్యాలగూడ వేదికగా బీఆర్ఎస్, సీపీఎం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో బీఆర్ఎస్, సిపిఎం మధ్య మిర్యాలగూడ స్థానం హాట్ టాపిక్‌గా మారింది.