అయ్యో పాపం.. హైదరాబాద్‌లో విషాదం.. భార్య పిల్లలు సహా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య..

హైదరాబాద్‌ కుషాయిగూడ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి దంపతులు, వారి పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూషాయిగూడలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య, భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు స‌తీష్, వేద‌, పిల్ల‌లు నిషికేత్, నిహ‌ల్ గా గుర్తించారు. చిన్నారుల అనారోగ్య కారణాలతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముందుగా పిల్లలను చంపి ప్రాణాలు తీసుకున్నారని తెలిసింది. సైనేడ్ తీసుకుని ఇద్దరు దంపతులు, వారి పిల్లలు […]

అయ్యో పాపం.. హైదరాబాద్‌లో విషాదం.. భార్య  పిల్లలు సహా సాఫ్ట్ వేర్ ఉద్యోగి  ఆత్మహత్య..
Death
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Mar 25, 2023 | 6:31 PM

హైదరాబాద్‌ కుషాయిగూడ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి దంపతులు, వారి పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూషాయిగూడలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య, భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు స‌తీష్, వేద‌, పిల్ల‌లు నిషికేత్, నిహ‌ల్ గా గుర్తించారు. చిన్నారుల అనారోగ్య కారణాలతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముందుగా పిల్లలను చంపి ప్రాణాలు తీసుకున్నారని తెలిసింది. సైనేడ్ తీసుకుని ఇద్దరు దంపతులు, వారి పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుషాయిగూడలోని క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు సతీష్‌, వేద దంపతులు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు సతీష్‌. ఈ క్రమంలో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటంతో అపార్ట్‌ వాసులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..