Jio Bharat Phone: రూ.999కే 4జీ ఫోన్.. వాట్సాప్, జియో యాప్స్ సహా అన్ని ఫీచర్లు..

అత్యంత చవకైన 4జీ ఫోన్ ను లాంచ్ చేసింది. కేవలం రూ. 999కే జియో భారత్ పేరిట బేసిక్ మోడల్లో ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు మన దేశంలో విక్రయాలకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా దీనికి సంబంధించిన టీజర్ ను రిలయన్స్ పోస్ట్ చేసింది. ఆగస్టు 28 మధ్యాహ్నం 12గంటల నుంచి ఈ కొత్త జియో ఫోన్ వినియోగదారులు కొనుగోలు చేయొచ్చని పేర్కొంది.

Jio Bharat Phone: రూ.999కే 4జీ ఫోన్.. వాట్సాప్, జియో యాప్స్ సహా అన్ని ఫీచర్లు..
Jio Bharat Phone
Follow us
Madhu

| Edited By: Vimal Kumar

Updated on: Jan 05, 2024 | 5:46 PM

మన దేశంలో రిలయన్స్ జియో సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే. ఇంటర్ నెట్ అందరి ఇంట్లోకి తెచ్చి పెట్టేసింది. 4జీ నెట్ వర్క్ వేగంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేలా చేసింది. చీప్ బెస్ట్ అనే ముద్ర జియోపై పడింది. అందుకు తగ్గట్లుగానే జియో తన ప్లాన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది. ఇదే క్రమంలో అత్యంత చవకైన 4జీ ఫోన్ ను లాంచ్ చేసింది. కేవలం రూ. 999కే జియో భారత్ పేరిట బేసిక్ మోడల్లో ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు మన దేశంలో విక్రయాలకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ఇండియా దీనికి సంబంధించిన టీజర్ ను రిలయన్స్ పోస్ట్ చేసింది. ఆగస్టు 28 మధ్యాహ్నం 12గంటల నుంచి ఈ కొత్త జియో ఫోన్ వినియోగదారులు కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. ఇది క్లాసిక్ బ్లాక్ కలర్ మోడల్లో అందుబాటులో ఉంటుందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. ఈ జియో భారత్ ఫోన్ కు సంబంధించిన పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఇప్పుడు చూద్దాం..

జియో భారత్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవి..

జియో భారత్ ఫోన్ ను కార్బన్ కంపెనీతో కలిసి సంయుక్తంగా తయారు చేసింది. జియో కార్బన్ కే1 కార్బన్ గా దీనిని పిలుస్తున్నారు. ఫోన్ ముందు వైపు భారత్ అని బ్రాండింగ్ లెటర్స్ ఉంటాయి. వెనుక వైపు కార్బన్ లోగో ఉంటుంది. ఈ ఫోన్లో పాత స్కూల్ టీ9 కీబోర్డ్ ఉంటుంది. వెనుక ప్యానల్ పైన ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంటుంది. వీజీఏ కెమెరా కూడా ఉంటుంది. వినియోగదారులు దీనిలో జియో సినిమా యాప్ ద్వారా సినిమాలు, వివిధ రకాల క్రీడకను వీక్షించవచ్చు.

ఈ ఫోన్లో 1.77అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డుతో 128జీబీ వరకూ స్టోరేజ్ ను విస్తరించుకోవచ్చు. దీర్ఘచతురస్త్రాకారపు డిజైన్ ను కలిగి ఉంటుంది. 1000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిలోనే పేమెంట్స్ కూడా చేసుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఫోన్ వాట్సాప్ నకు కూడా సపోర్టు చేస్తుంది. జియో యాప్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

జియో భారత్ ఫోన్ ను మీరు వినియోగించుకోవాలంటే రూ. 123 విలువైన రీచార్జ్ ప్లాన్ కలిగి ఉండాలి. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలో అన్ లిమిటెడ్ కాలింగ్, 14జీబీ 4జీ డేటా లభిస్తుంది. జియో యాప్స్ ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఇదే కాక వినియోగదారులు రూ. 1,234విలువైన వార్షిక ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ జియో ఫోన్ కేవలం అమెజాన్ లో మాత్రమే విక్రయానికి ఉంచారు. ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉండదు. అయితే త్వరలో దీనిని రిలయన్స్ రిటైల్ అవుట్ లెట్లలో కూడా విక్రయించే అవకాశం ఉందని, త్వరలో దీనికి సంబంధించిన వివరాలు రిలయన్స్ వెల్లడిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..