Iphone 13: ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే ఇదే కరెక్ట్ టైమ్, దీపావళికి భారీ డిస్కౌంట్..
యాపిల్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 14 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ వచ్చిన తర్వాత కూడా ఐఫోన్ 13కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే ఐఫోన్ 13 అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి...
యాపిల్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 14 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ వచ్చిన తర్వాత కూడా ఐఫోన్ 13కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే ఐఫోన్ 13 అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ కామర్స్ సైట్స్ పండగ ఆఫర్‌లో భాగంగా అందిస్తోన్న భారీ డిస్కౌంట్స్‌తో ఐఫోన్ 13 అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐఫోన్ 13పై పలు బ్యాంకులు భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి.
దివాళీ పండుగ సేల్‌లో భాగంగా ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ లవర్స్‌కి బంపరాఫర్ ఇచ్చింది. సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.69,990 ఉండగా రూ.59,990కే అందిస్తుంది. ఇక 256జీబీ, 512జీబీ ఫోన్‌ల ధరలను సైతం తగ్గించింది. దీంతో పాటు ఎస్‌బీఐ, కొటాక్ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో ఐఫోన్ 13ని కొనుగోలు చేసే వారికి రూ. 1250 డిస్కౌంట్ లభించనుంది. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 16,990 వరకు పొందొచ్చు.
ఇక ఐఫోన్ 13 ఫీచర్ల విషయానికొస్తే ఈ సిరీస్‌లో ఐఫోన్ 13, మినీ, ప్రో, ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 13లో 6.1 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఇక మినీలో 5.4 ఇంచెస్ స్క్రీన్‌ను ఇచ్చారు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లలో అధునాతన డ్యుయల్ కెమెరాలు, 5జీ, 6 కోర్ సీపీయూ, 4 కోర్ జీపీయూ, కొత్త ఏ15 బయోనిక్ చిప్‌సెట్ వంటివి అందించారు. ఐఫోన్ 12తో పోల్చితే 13లో బ్యాటరీ సామర్థ్యం పెంచారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..