WhatsApp: వాట్సాప్‌లో ఫొటో క్వాలిటీ తగ్గకుండా షేర్ చేయాలంటే ఎలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..

వాట్సాప్ లో మీరు ఏదైనా ఫొటో పంపితే అది ఆటోమేటిక్ గా క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే కంప్రెస్ అయ్యి మీరు పంపే వారికి వెళ్తాయి. ఎన్నిసార్లు ఆ ఫొటో మీరు షేర్ చేస్తే అంత క్వాలిటీ దెబ్బతింటుంది. దీనిపైనే వాట్సాప్ ఇప్పుడు కసరత్తు చేస్తోంది. అయితే మీరు ఇప్పుడు ఉన్న వెర్షన్లో కూడా మీరు పంపాలనుకుంటున్న ఇమేజ్ క్వాలిటీ తగ్గకుండా ఇతరులకు పంపొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

WhatsApp: వాట్సాప్‌లో ఫొటో క్వాలిటీ తగ్గకుండా షేర్ చేయాలంటే ఎలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..
WhatsApp Tips
Follow us
Madhu

|

Updated on: Aug 24, 2023 | 6:00 PM

మెసేజింగ్ ప్లాట్ ఫారంలో వాట్సాప్ ఒక ప్రభంజనం అని చెప్పాలి. ప్రస్తుతం వాట్సాప్ లేని సమాజాన్ని మన దగ్గర ఊహించడం కష్టం. అంతలా జనాలతో కనెక్ట్ అయిపోయింది మెటా యాజమాన్యంలోని వాట్సాప్. కేవలం మెసేజ్ లు, చాటింగ్ కోసమే కాకుండా.. మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునేందుకు వీలుగా స్టేటస్ లు, సమూహాలతో కలివిడిగా ఉండటానికి గ్రూప్ లు, కమ్యూనిటీలు ఈ ప్రముఖ మెసేజింగ్ యాప్ లో ఉంటాయి. అయితే ఎప్పటి నుంచే వాట్సాప్ లో ఉన్న ప్రధాన లోటు ఇమేజ్ క్వాలిటీ. వాట్సాప్ లో మీరు ఏదైనా ఫొటో పంపితే అది ఆటోమేటిక్ గా క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే కంప్రెస్ అయ్యి మీరు పంపే వారికి వెళ్తాయి. ఎన్నిసార్లు ఆ ఫొటో మీరు షేర్ చేస్తే అంత క్వాలిటీ దెబ్బతింటుంది. దీనిపైనే వాట్సాప్ ఇప్పుడు కసరత్తు చేస్తోంది. ఇమేజ్ ఫార్మేట్ లోనే దాని క్వాలిటీ దెబ్బతినకుండా షేర్ అయ్యే విధంగా కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. అయితే మీరు ఇప్పుడు ఉన్న వెర్షన్లో కూడా మీరు పంపాలనుకుంటున్న వాట్సాప్ఇమేజ్ క్వాలిటీ తగ్గకుండా ఇతరులకు పంపొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

డాక్యూమెంట్ ఫార్మేట్..

మీరు ఫొటోలు పంపేటప్పుడు దానిని ఇమేజ్ ఫార్మేట్ లో ఉంచి పంపితే అది ఆటోమేటిక్ గా కంప్రెస్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ దాని ఫార్మేట్ మార్చి పంపుకోవాలి. అదెలా సాధ్యం అనుకుంటున్నారా. వాట్సాప్ లో మీర ఏ ఇమేజ్ ను అయినా అది జేపీఈజీ అయినా మరేదైనా ఫార్మేట్ అయినా దానిని డాక్యుమెంట్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. అలా డాక్యుమెంట్ ఫార్మేట్ లో ఫోటో షేర్ చేస్తే ఇమేజ్ కంప్రెస్ అవ్వదు. మీరు ఎంత క్వాలిటీతో అయితే పంపుతారో అంతే క్వాలిటీతో అవతలి వ్యక్తికి చేరుతుంది.

ఎలా పంపాలంటే..

  • మీరు ముందుగా వాట్సాప్ అప్లికేషన్ ను ఓపెన్ చేయాలి.
  • కింద చాట్ బార్ వద్ద ఉన్న ఆప్షన్లలో డాక్యుమెంట్స్ దానిపై క్లిక్ చేయాలి.
  • మీరు షేర్ చేయాలనుకుంటున్న చిత్రాన్ని గ్యాలరీ నుంచి ఎంపిక చేసుకోవాలి.
  • సెండ్ బటన్ పై క్లిక్ చేయాలి. అంతే ఇక మీ ఫొటో డాక్యుమెంట్ ఫార్మాట్ లో క్వాలిటీ తగ్గకుండా అవతలి వారికి చేరిపోతుంది.

ప్రీవ్యూ కనపబడదు..

మీరు పంపాలకున్న ఇమేజ్ డాక్యుమెంట్ ఫార్మేట్లో అవతలి వ్యక్తికి చేరుతుంది. కానీ వారి ఎటువంటి ప్రీవ్యూ కనిపించదు. సాధారంగా ఇమేజ్ ఫార్మేట్ అయితే మీకు ప్రీవ్యూ బ్లర్ అయ్యి కనిపిస్తుంది. డాక్యుమెంట్ ఫార్మేట్ లో డౌన్ లోడ్ చేయకుండా అది కనిపించదు. అయితే దీనివల్ల మీకు ఫొటోలు కంప్రెస్ కాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

త్వరలో ఫుల్ క్వాలిటీతో పంపేలా..

వాట్సాప్ ట్రాకర్ వాబీటా ఇన్ ఫో ఇటీవలి నివేదికల ప్రకారం.. వాట్సాప్ తన వినియోగదారులను ఒరిజినల్ క్వాలిటీతో కూడిన చిత్రాలను షేర్ చేసుకునేలా కొత్త అప్ డేట్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. డ్రాయింగ్ టూల్ హెడర్‌లో కొత్త సెట్టింగ్ చిహ్నాన్ని ఏకీకృతం చేయాలని వాట్సాప్ యోచిస్తున్నట్లు చెప్పింది. ఇది ఏదైనా ఫోటో నాణ్యతను కాన్ఫిగర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుందని వివరించింది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న ఫీచర్ భవిష్యత్ అప్ డేట్లలో వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..