U20 World Championship, Antim Panghal: భారత యువ మహిళా రెజ్లింగ్ క్రీడాకారిణి, అంతిమ్ పంఘాల్ చరిత్ర సృష్టించింది. జోర్డాన్‌లోని అమ్మన్‌లో జరుగుతున్న అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 53 కిలోల బరువు విభాగంలో ఆమె ఈ పతకాన్ని సాధించింది. పోయినసారి కూడా ఇదే విభాగంలో బంగారు పతకం సాధించిన ఆమె.. ఈసారి కూడా విజయవంతంగా టైటిల్‌ను కాపాడుకుంది. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో వరుసగా రెండు బంగారు పతకాలు సాధించిన భారత్‌కు చెందిన తొలి మహిళా రెజ్లర్‌గా నిలిచింది.
టైటిల్ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన మరియా యెఫ్రెమోవాను 4-0ను ఓడించి చివరిగా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. అనంతరం టోర్నీ ఆద్యంతం బలమైన ఆటను కనబరిచింది. భారతదేశపు వెటరన్ మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈ గేమ్‌ల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంఘల్ ఈ టోర్నమెంట్‌లో చోటు దక్కించుకుంది.
U20 worlds Wrestling : #AntimPanghal defeats Yefremova in 53Kg category to successfully defend her U20 world title. Panghal becomes first Indian woman wrestler to win two world titles. @IndiaSports @ianuragthakur pic.twitter.com/2SYqs3WVwq
— Upendrra Rai (@UpendrraRai) August 18, 2023
సవిత 62 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. టైటిల్ మ్యాచ్‌లో సవిత వెనిజులాకు చెందిన ఎ. పావోలా మోంటెరో చిరినోస్‌ను సాంకేతిక ఆధిక్యత ఆధారంగా ఓడించింది. వీరిద్దరి కంటే ముందు గురువారం నాడు ప్రియా మాలిక్ 76 కేజీల విభాగంలో టైటిల్ సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ మొత్తం ఏడు పతకాలు సాధించగా, అందులో మూడు బంగారు పతకాలు కావడం గమనార్హం. చివరిగా కుందు 65 కేజీల విభాగంలో రజత పతకం, రీనా 57 కేజీలలో రజత పతకం, అర్జు 68 కేజీలలో కాంస్య పతకం, హర్షిత 72 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
How interesting this development is and also give us a revision on life lessons:#AntimPanghal, who was originally qualified in her weight category (53kg) for the #AsianGames2023 Games, was not given the chance as #VineshPhogat (due to her decorated achievements and seniority).. pic.twitter.com/QYgL5ZOTYb
— suryanshi pandey (@UnfilteredSP) August 15, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..