Asian Champions Trophy 2023: చెన్నైలో జరుగుతోన్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 గ్రూప్ దశలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. హాకీ ఇండియా (Hockey India) ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ మూడింటిలో విజయం సాధించగా, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు (ఆగస్టు 11) జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో జపాన్(India vs Japan)తో తలపడనుంది.
గ్రూప్ దశలో ఇరు జట్లు ఇప్పటికే ఓసారి తలపడ్డాయి. కానీ ఆ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఇప్పుడు ఈ రెండు జట్లు సెమీఫైనల్‌లో పోటీపడుతుండడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానంలో ఉండగా, జపాన్ 19వ స్థానంలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జపాన్‌పై భారత్ పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయలేం. దీంతో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
Coming up 👉
The #MenInBlue are ready to face Japan again to book their spot in the Final and two more scintillating matches for you.
Who will reign supreme?
🏟️ Mayor Radhakrishnan Hockey Stadium
⏰ 11th August 2023, 3:30 PM IST onwards.
📺 Catch all the action LIVE on Star… pic.twitter.com/ZT6NVCNKDv— Hockey India (@TheHockeyIndia) August 11, 2023
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 11, శుక్రవారం భారత్-జపాన్ జట్ల మధ్య జరగనుంది.
చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో భారత్-జపాన్ జట్ల మధ్య ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
రాత్రి 8.30 గంటలకు భారత్-జపాన్ జట్ల మధ్య ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే Fancode మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో భారతదేశం vs జపాన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ని చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..