Team India: బ్యాటింగ్‌లో దూకుడు.. కీపింగ్‌లోనూ చురకత్తి.. పంత్‌లాంటి ప్లేయర్ ఎంట్రీ ఇచ్చేశాడు..
Rishabh Pant: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ఓ కీలక ప్లేయర్ సిద్ధమయ్యాడు.
Asian Games-2023, Rishabh Pant: స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ లేకుండా, భారతదేశం ఇటీవల ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో సహా అనేక సిరీస్‌లను ఆడింది. అతను IPL-2023లో కూడా భాగం కాదు. పంత్ ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత అతను చాలా కాలం పాటు చికిత్స పొందాడు. శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. అయితే, ఈ క్రమంలో అతనిలాంటి దూకుడు వైఖరికి ప్రసిద్ధి చెందిన భారత ఆటగాడు అతి త్వరలో అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు.
టీమ్ ఇండియాలో చోటు..
ప్రస్తుతం రిషబ్ పంత్‌లానే ఒక ఆటగాడు బ్యాట్‌తో కోలాహలం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ (IPL-2023) చివరి సీజన్‌లో చూపించిన దూకుడు పద్ధతిలోనే ఆడగలడని భావిస్తున్నారు. తాజాగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న ఈ ఆటగాడు అంతర్జాతీయ అరంగేట్రం చేయగలడని అంతా భావిస్తున్నారు. చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో అతను టీమిండియాకు వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వహించగలడు.
రాహుల్ ద్రవిడ్ ప్రత్యేక సలహాలు..
ఆసియా క్రీడల కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న దూకుడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ కీలక ప్రకటన చేశాడు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సలహాను పాటిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ విదర్భ ఆటగాడు తన సహజమైన ఆటను కొనసాగించాలని ద్రవిడ్ కోరాడు. ఐపీఎల్ చివరి రెండు సీజన్లలో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జితేష్ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో భాగమయ్యాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో సంజూ శాంసన్ గాయపడటంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఆటగాడికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.
‘ఇలాగే బ్యాటింగ్ చేస్తూ ఉండండి’
ఈ 29 ఏళ్ల ఆటగాడు ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ‘ఆటలో మెరుగుదల గురించి ఎల్లప్పుడూ చర్చ జరుగుతుంది. కొన్ని నెలల క్రితం, నేను సొంతగడ్డపై ఆడిన సిరీస్‌లో జట్టులో భాగమయ్యాను. నేను రాహుల్ (ద్రావిడ్) సర్‌తో మాట్లాడాను. అతను నాకు సలహా ఇచ్చాడు. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న విధానాన్నే కొనసాగించండి. మేం భవిష్యత్తులో వెతుకుతున్నది ఇదే. బ్యాటింగ్‌లో ఐదో లేదా ఆరో స్థానంలో మాకు అలాంటి ఆటగాళ్లు అవసరం అంటూ చెప్పినట్లు ద్రవిడ్ చెప్పాడని తెలిపాడు.
జితేష్ ఫినిషర్ పాత్రను కూడా పోషించగలడు..
టీ20 క్రికెట్‌లో ఫినిషర్ పాత్ర ముఖ్యమైనది. ఐపీఎల్‌లో జితేష్ అలానే కనిపించాడు. ఫినిషర్‌కు పెద్ద షాట్‌లను సులభంగా ఆడగల సహనం అవసరం. ఈ రెండు విషయాల్లోనూ జితేష్ అద్భుతంగా ఉన్నాడు. అతను పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుతో IPL గత రెండు సీజన్లలో ఈ పని చేశాడు. జితేష్ చివరి ఓవర్‌లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచాడు. అతను ఆసియా క్రీడలలో కూడా తన ఫామ్‌ను కొనసాగించగలడని భావిస్తున్నారు.
రితురాజ్ కెప్టెన్సీలో బరిలోకి..
జితేష్ ఇప్పుడు ఆసియా గేమ్స్‌లో రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఐపీఎల్‌లో రీతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత కొంత కాలంగా జట్టులో చోటు దక్కించుకోవడానికి దగ్గరగా ఉన్న జితేష్.. జాతీయ జట్టులోకి ఎంపికైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. భారత జట్టులో అతని ఎంపిక గురించి మాట్లాడుతూ.. ‘నేను దాని గురించి ఆశ్చర్యపోలేదు. ఆటగాడిగా, ఈ రేసులో పాల్గొన్న అనుభూతిని పొందుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆసియా క్రీడలకు భారత్ తొలిసారిగా తన క్రికెట్ జట్టును పంపనుంది. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..