KKR IPL 2023 Preview: కొత్త సారథితో ఫుల్ జోష్‌‌లో కోల్‌కతా.. బెస్ట్ ప్లేయింగ్‌ XIలో ఎవరున్నారంటే?

|

Mar 27, 2023 | 7:12 PM

Kolkata Knight Riders Best Playing XI in IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్ అంటే IPL 2023 ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫార్మాట్ పాతదే.. కానీ, నిబంధనలు మాత్రం కొత్తగా కనిపిస్తాయి.

KKR IPL 2023 Preview: కొత్త సారథితో ఫుల్ జోష్‌‌లో కోల్‌కతా.. బెస్ట్ ప్లేయింగ్‌ XIలో ఎవరున్నారంటే?
Kkr
Follow us on

Kolkata Knight Riders: ఐపీఎల్ 16వ సీజన్ అంటే IPL 2023 ప్రారంభానికి సిద్ధమైంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఫార్మాట్ పాతదే.. కానీ, నిబంధనలు మాత్రం కొత్తగా కనిపిస్తాయి. రెండుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారి కూడా భీకరంగా సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులో కొన్ని మార్పులు చేసింది. అయ్యార్ స్థానంలో కోల్‌కతా నూతన సారథిగా నితీష్ రాణా ఎన్నికయ్యాడు. దీంతో కొత్త సారథితో ఐపీఎల్ 2023లో బరిలోకి దిగనుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు కనిపించనున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కేకేఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

లిటన్ దాస్: కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున వికెట్ కీపింగ్, ఓపెనింగ్ బ్యాటింగ్‌ను నిర్వహించగల బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ లిటన్ దాస్ ఈ జాబితాలో మొదటి నంబర్‌గా నిలిచాడు.

వెంకటేష్ అయ్యర్: ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ నంబర్ టూలో ఉండే అవకాశం ఉంది. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ జట్టు నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వెంకటేష్ ఈ సీజన్‌లో కూడా కేకేఆర్ కోసం ఓపెనింగ్, పార్ట్ టైమ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు.

ఇవి కూడా చదవండి

నితీష్ రాణాకు కెప్టెన్సీ బాధ్యతలు..

నితీష్ రాణా: గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ ఆడటం లేదు. దీంతో నితీష్ రాణాను మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగవచ్చు. నితీష్ రాణా గత కొన్ని సంవత్సరాలుగా కేకేఆర్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. గత సీజన్‌లో 143 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో 361 పరుగులు చేశాడు. అయ్యర్ స్థానంలో జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

రింకూ సింగ్: రింకు సింగ్‌కు నాలుగో నంబర్‌లో మిడిల్ ఆర్డర్ బాధ్యతలు ఇవ్వవచ్చు. రింకు సింగ్ కూడా కేకేఆర్‌తో చాలా కాలం పాటు అనుబంధం కలిగి ఉన్నాడు. గత సీజన్లో సత్తా చాటాడు.

మన్‌దీప్ సింగ్: మన్‌దీప్ సింగ్‌కు 5వ స్థానంలో ఆడే అవకాశం లభించవచ్చు. మన్‌దీప్ సింగ్‌లో కేకేఆర్ మిడిల్ ఆర్డర్‌లో కుడిచేతి వాటం కలిగిన బ్యాట్స్‌మన్‌. అవసరమైనప్పుడు భారీ షాట్‌లను కొట్టగలడు.

ఆండ్రీ రస్సెల్: ఆండ్రీ రస్సెల్‌ 6వ స్థానంలో బరిలోకి దిగవచ్చు. ఆండ్రీ రస్సెల్ 6వ ర్యాంక్‌లో ఎంత ప్రమాదకరంగా ఉంటాడో అందరికీ తెలిసిందే.

సునీల్ నరైన్: మరో వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ నరైన్ 7వ స్థానంలో ఉన్నాడు. సునీల్ నరైన్ బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించగలడు. అతను గత సీజన్‌లో కూడా అద్భుతాలు చేశాడు. ఐపీఎల్ 2022లో సునీల్ నరైన్ 5.57 అద్భుతమైన ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు.

శార్దూల్ ఠాకూర్: శార్దూల్ ఠాకూర్ ఎనిమిదవ స్థానంలో బరిలోకి దేగే ఛాన్స్ ఉంది. శార్దూల్ ఠాకూర్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. కానీ, ఈ సీజన్‌లో కేకేఆర్ జెర్సీలో కనిపించనున్నాడు. శార్దూల్ బంతితో అద్భుతాలు చేయగలడు. అలాగే, బ్యాటింగ్‌లో కూడా తన జట్టుకు చాలా సహాయం చేయగలడు.

ఉమేష్ యాదవ్: ఉమేష్ యాదవ్ నెం.9లో ఉండే అవకాశం ఉంది. గత సీజన్‌లో కేకేఆర్‌ తరపున ఉమేష్‌ యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఉమేష్‌ కేకేఆర్ పేస్ అటాక్‌కు నాయకత్వం వహించగలడు.

టిమ్ సౌదీ: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌదీ 10వ స్థానంలో ఉన్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ తన బౌలింగ్‌తో కేకేఆర్‌కి చాలా సహాయం చేయగలడు.

వరుణ్ చక్రవర్తి: గత కొన్ని సీజన్‌లుగా కేకేఆర్ కోసం మిస్టరీ స్పిన్నర్ పాత్రను పోషిస్తున్న వరుణ్ చక్రవర్తి 11వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..