T20 World Cup 2023: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి దూరమైన స్టార్ ప్లేయర్?

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2023లో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొదటి మ్యాచ్‌ని ఫిబ్రవరి 12న పాకిస్తాన్ మహిళల జట్టుతో ఆడాల్సి ఉంది.

T20 World Cup 2023: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి దూరమైన స్టార్ ప్లేయర్?
Womesn Team India
Follow us
Venkata Chari

|

Updated on: Feb 12, 2023 | 8:00 AM

మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వేలి గాయం కారణంగా టీమిండియా వెటరన్ ప్లేయర్ స్మృతి మంధాన జట్టుకు దూరమైంది. మంధాన గాయపడినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడడం లేదని తెలుస్తోంది. ఇది టీమిండియాకు పెద్ద నష్టంగా మారనుంది. మంధానకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

వేలికి గాయం కావడంతో స్మృతి మంధాన ఇబ్బంది పడుతోంది. ఈ కారణంగానే ఆమె పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైంది. క్రిక్‌ఇన్‌ఫో వార్తల ప్రకారం, మంధాన వేలికి ఎలాంటి ఫ్రాక్చర్ లేదని రిషికేశ్ కనిట్కర్ చెప్పుకొచ్చారు. ఇది ఉపశమనం కలిగించే అంశం. కాబట్టి రెండో మ్యాచ్‌లో స్మృతి భారత్ తరఫున ఆడే అవకాశం ఉందంట. “హర్మన్ ఆడటానికి సిద్ధంగానే ఉంది. నెట్స్‌లో రెండు రోజులు బ్యాటింగ్ చేసింది. వేలి గాయం నుంచి స్మృతి కోలుకుంది. అయితే, తొలి మ్యాచ్‌లో ఆడడం కుదరదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత టీమిండియా కేప్ టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. అలాగే ఇంగ్లండ్‌తో భారత్‌ మూడో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18న జరగనుంది. అదే సమయంలో భారత జట్టు ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. టోర్నమెంట్‌లోని మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 23న కేప్‌టౌన్‌లో జరగనుండగా, ఫిబ్రవరి 24న రెండో సెమీ-ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..