Garuda Panchami: తిరుమలలో నేడు గరుడ పంచమి.. నిర్మలమైన, బలమైన సంతానం కోరుతూ పూజలు..

| Edited By: Surya Kala

Aug 21, 2023 | 10:31 AM

తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తుండగా నూతన దంపతులు తమ వైవాహిక జీవితం బాగుండాలని, పుట్టే సంతానం గరుడు లాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండాలని మొక్కులు పూజలు చేయడం గరుడపంచమిపూజ ప్రాశస్త్యం. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గరుడ పంచమి రోజు తిరు వీధుల్లో ఊరేగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకోనున్నారు.

Garuda Panchami: తిరుమలలో నేడు గరుడ పంచమి.. నిర్మలమైన, బలమైన సంతానం కోరుతూ పూజలు..
Garuda Panchami Seva
Follow us on

తిరుమ‌ల‌లో నేడు గరుడ పంచమి జ‌రుగ‌నుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామి ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెలలో మలయప్ప స్వామి రెండోసారి గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ప్రతి ఏడాది తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తుండగా నూతన దంపతులు తమ వైవాహిక జీవితం బాగుండాలని, పుట్టే సంతానం గరుడు లాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండాలని మొక్కులు పూజలు చేయడం గరుడపంచమిపూజ ప్రాశస్త్యం. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గరుడ పంచమి రోజు తిరు వీధుల్లో ఊరేగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకోనున్నారు.

నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి.ఈ రోజున మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టి పీటపై అరిటాకులు పరచి బియ్యము పోసి వారి శక్తి మేరకు బంగారం వెండి ప్రతిష్టించి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు

మరోవైపు శ్రావణ మాసం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనం కోసం భక్తులు 15 కంపార్ట్మెంట్స్ లో క్యూ లైన్ లో ఎదురుచూస్తున్నారు. మరోవైపు సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తుల దర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతుంది. ఈ రద్దీ ఈ నెలాఖరువరకూ ఇలాగే కొనసాగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..