1 / 5
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడిన అద్భుతమైన, కలలో కూడా ఊహకు అందని చిత్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒకటిగా తాజ్ మహల్ కీర్తిగాంచింది. తాజ్ మహల్ కు సంబంధించిన కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తే దాని నిర్మాణ సమయంలో వీక్షణ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. 370 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణం తర్వాత షాజహాన్ అలాంటి భవనాన్ని మరెవరూ నిర్మించకూడదని కూలీల చేతులు నరికివేసినట్లు చెబుతున్నారు.