Lamp Flame vs Gas Flame: అగ్ని జ్వాల ఎరుపు, నీలం రంగుల్లో ఎందుకు ఉంటుంది? దీనివెనుక కారణం ఇదే..

అగ్నికి ఆక్సిజన్ అవసరం. అగ్ని జ్వాల రంగు ఆక్సిజన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఆక్సిజన్ ప్రతిచోటా ఒకేలా ఉంటుంది. మరి ల్యాంప్ లైట్, గ్యాస్ ఫైర్ రంగుల్లో తేడా ఎందుకు ఉంటుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రంగుల్లో తేడాకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Shiva Prajapati

|

Updated on: Jun 17, 2023 | 10:05 PM

ప్రస్తుతం కాలంలో చాలామంది గ్యాస్ స్టౌ లేని ఇళ్లు చాలా అరుదనే చెప్పాలి. ప్రజలు తమ తమ ఇళ్లలో గ్యాస్ పొయ్యి మీదనే వంటలు చేస్తుంటారు. అయితే, గ్యాస్ వెలిగించిన తరువాత దాని మంట నీలం రంగులో ఉంటుంది. అదే కిరోసిన్ స్టౌ, ఓవెన్‌, హీటర్ మంటలు పసుపు రంగులో ఉంటాయి. మరి ఎందుకులా వస్తుంది. ఈ రంగుల్లో తేడా ఎందుకు ఉంటుంది?

1 / 7
అగ్ని జ్వాల అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సో అంటే విడుదల, థర్మిక్ అంటే వేడి. అంటే.. వేడిని ఉత్పత్తి చేసే ప్రక్రియ మంటల రూపంలో విడుదల అవుతుంది. ఇది రసాయన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వాస్తవానికి అన్ని సేంద్రీయ పదార్థాలు అణువులతో తయారవుతాయి. ఇందులో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. న్యూట్రాన్లు, ప్రోటాన్లు అణువు కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి. ఎలక్ట్రాన్లు క్రియారహితం అవుతాయి. మంటలను కలిగించే ఫోటాన్‌లకు శక్తిని బదిలీ చేస్తాయి.

2 / 7
అన్ని ఇంధనాలు కార్బన్ ఆధారితమైనవి. అవి LPG సిలిండర్లు, కొవ్వొత్తులు, అగ్గిపుల్లలు. అయినప్పటికీ, అవన్నీ మంట, దాని రంగులో విభిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో ఆక్సిజన్ ఉంటుంది. ఎలక్ట్రాన్లు ఫోటాన్‌లకు శక్తిని బదిలీ చేసినప్పుడు.. అగ్ని జ్వాల బయటకు వస్తుంది. ఆ సమయంలో ఆక్సిజన్ మంటతో కలుస్తుంది. కార్బన్ అణువులు మారుతాయి. కార్బన్ అణువులు.. డయాక్సైడ్‌గా రూపాంతరం చెందుతుంది. ఇది మంట రంగును మారుస్తుంది.

3 / 7
ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే.. అది పూర్తిగా కార్బన్‌ను కార్బన్ డయాక్సైడ్‌గా మారుస్తుంది. మంట నీలం రంగులోకి మారుతుంది. తగినంత ఆక్సిజన్ లేనట్లయితే.. కార్బన్ CO2గా మారదు. మంటల పైభాగం నల్లగా కనిపిస్తుంది. ఇది మనం మసిగా చూడొచ్చు.

4 / 7
కొవ్వొత్తులు, కలప, కాగితాన్ని కార్బన్ అణువులుగా పరిగణిస్తారు. వాతావరణంలోని ఆక్సిజన్ పరంగా వాటిని పరిశీలిస్తే.. వాటిలో ఎక్కువ కార్బన్ ఉంటుంది. అందుకే అవి ఆక్సీకరణం చెందుతాయి. కానీ పూర్తిగా కాదు, అందుకే వాటి నుండి వచ్చే మంట నారింజ, పసుపు రంగులో ఉంటుంది.

5 / 7
LPG, మీథేన్ వంటి సాధారణ ఇంధనాలు చాలా తక్కువ కార్బన్‌ను కలిగి ఉంటాయి. ఇవీ ఆక్సీకరణ చెందినప్పుడు.. ఆక్సిజన్ వాటికి పూర్తిగా వ్యాపిస్తుంది. ఈ కారణంగా వాటి మంట నీలం రంగులో కనిపిస్తుంది.

6 / 7
ఏదైనా అగ్ని జ్వాల లేదా దాని రంగు వాతావరణంలోని ఆక్సిజన్ ప్రకారం ఉంటుంది. అది మండే పదార్థం కార్బన్‌తో చర్య జరిపి మంట రంగును ఏర్పరుస్తుంది.

7 / 7
Follow us