IPL 2023: తొలిసారిగా ఐపీఎల్ ఆడబోతున్న టాప్ 9 విదేశీ ఆటగాళ్లు వీరే..

ఐపీఎల్‌లో ఆడాలనేది ప్రతి క్రికెటర్‌ కల. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో కొంతమంది ఆటగాళ్లకు ఈ కల నెరవేరనుంది. వారిలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉండడం గమనార్హం. మరి వరల్డ్ రిచ్ టోర్నమెంట్‌లో తొలిసారిగా(ఐపీఎల్ 2023) కనిపించనున్న టాప్ 9 విదేశీ ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 20, 2023 | 6:40 PM

ఐపీఎల్‌లో ఆడాలనేది ప్రతి క్రికెటర్‌ కల. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో కొంతమంది ఆటగాళ్లకు ఈ కల నెరవేరనుంది. వారిలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉండడం గమనార్హం.

1 / 10
Harry Brook: ఇంగ్లండ్‌ జట్టులోని విధ్వంసకర యువ బ్యాట్స్‌మ్యాన్ హ్యారీ బ్రూక్ తన కెరీర్‌లో తొలి సారిగా IPL ఆడబోతున్నాడు. హ్యారీ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఇంగ్లాండ్ తరపున 20 టీ20 మ్యాచ్‌లు ఆడిన హ్యారీ బ్రూక్ 1 హాఫ్ సెంచరీతో సహా 372 పరుగులు చేశాడు.

2 / 10
Michael Bracewell: ఇంగ్లాండ్ ఆటగాడు విల్ జాక్స్ స్థానంలో ఆర్‌సీడీ జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్ ఆటగాడు మైకేల్ బ్రేస్‌వెల్ కూడా ఐపీఎల్‌లో అరంగేట్రం 16వ సీజన్‌లోనే చేయనున్నాడు. న్యూజిలాండ్ తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడిన బ్రేస్‌వెల్ 21 వికెట్లతో పాటు 113 పరుగులు కూడా చేశాడు.

3 / 10
Reece Topley: ఇంగ్లాండ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ కూడా తొలిసారిగా ఐపీఎల్ ఆడనున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతని కోసం రూ.1.90 కోట్లు ఖర్చు చేసింది. ఈ బౌలర్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు తీశాడు.

4 / 10
Phil Salt: ఈ ఇంగ్లిష్ ప్లేయర్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.2 కోట్లు ఖర్చు చేసి, అతన్ని తమ సొంతం చేసుకోంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆటగాడు.. 308 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి రెండు అర్ధశతకాలు కూడా వచ్చాయి.

5 / 10
Sikandar Raza: జింబాబ్వేకు చెందిన సికందర్ రజా కూడా తొలిసారి ఐపీఎల్‌లో ఆడనున్నాడు. రూ.50 లక్షలతో పంజాబ్ కింగ్స్‌లో చేరిన రజా, ఇప్పటి వరకు 66 టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడి, 6 అర్ధసెంచరీలతో 1259 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 38 వికెట్లు తీశాడు.

6 / 10
Joe Root: ఇంగ్లాండ్‌ వెటరన్‌ ఆటగాడు జో రూట్‌ను కూడా తొలిసారి ఐపీఎల్‌ జట్టు కొనుగోలు చేసింది. కోటి రూపాయలతో రాజస్థాన్ రాయల్స్‌లో చేరిన రూట్.. ఇంగ్లాండ్ తరఫున 32 టీ20లు ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లలో అతను ఐదు అర్ధ సెంచరీలతో సహా 893 పరుగులు చేశాడు.

7 / 10
Litton Das: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ కూడా ఈ ఐపీఎల్‌లో తొలిసారిగా కనిపించనున్నాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

8 / 10
Duan Jansen: దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డువాన్ జాన్సెన్ కూడా ఐపీఎల్ అరంగేట్రం ఈ ఏడాది చేయనున్నాడు. అతడిని ముంబై ఇండియన్స్ జట్టు 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఇంకా అరంగేట్రం చేయలేదు.

9 / 10
Joshua Little: ఐర్లాండ్‌కు చెందిన ఈ ఆటగాడు తొలిసారి ఐపీఎల్‌లో ఆడనున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన లిటిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ రూ.4.40 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ 53 టీ20 మ్యాచుల్లో 62 వికెట్లు పడగొట్టాడు.

10 / 10
Follow us