Watch Video: పబ్లిక్‌గా రెచ్చిపోయిన లవ్ బర్డ్స్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు.. సరిపోదంటున్న నెటిజన్లు..

Delhi Police: బైక్‌ల‌పై యువ ప్రేమికుల రొమాన్స్ హద్దులు దాటుతోంది. బైక్‌పై వెళ్తూ ముద్దులు పెట్టుకున్న ఘటనలు కూడా ఇప్పటికే చాలా జరిగాయి. అలా దేశ రాజధానిలోని ఓ ఫ్లైఓవర్ మీద బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేస్తున్న యువ జంటకు సంబంధించిన వీడియో ఢిల్లీ పోలీసుల కంట..

Watch Video: పబ్లిక్‌గా రెచ్చిపోయిన లవ్ బర్డ్స్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు.. సరిపోదంటున్న నెటిజన్లు..
Viral Video Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 21, 2023 | 7:05 AM

Delhi Police: బైక్‌ల‌పై యువ ప్రేమికుల రొమాన్స్ హద్దులు దాటుతోంది. బైక్‌పై వెళ్తూ ముద్దులు పెట్టుకున్న ఘటనలు కూడా ఇప్పటికే చాలా జరిగాయి. అలా దేశ రాజధానిలోని ఓ ఫ్లైఓవర్ మీద బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేస్తున్న యువ జంటకు సంబంధించిన వీడియో ఢిల్లీ పోలీసుల కంట పడింది. ఆ వైరల్ వీడియోలో సదరు జంటకు సంబంధించిన బైక్ నంబర్ స్పష్టంగా కనిసిస్తుండడంతో దానికి ఏకంగా 11 వేల రూపాయల ఫైన్ విధించారు ఢిల్లీ పోలీసులు. ఈ మేరకు తమ అధికార ట్విట్టర్ ఖాతా నుంచి వీడియోతో సహా, ఫైన్ వేసినట్లుగా ట్వీట్ చేశారు.

ఢిల్లీ పోలీసులు షేర్ చేసిన ఆ వీడియోలో సదరు జంటను చూడవచ్చు. బైక్‌ని యువకుడు నడుపుతుండగా.. అతని ప్రియురాలు బైక్ పెట్రోల్ ట్యాంకర్‌పై కూర్చుని అతన్ని కౌగిలించుకుంది. వివరాల్లోకి వెళ్లే.. ఢిల్లీ ఔట‌ర్ రింగు రోడ్డు ఫైఓవ‌ర్‌పై వెళ్తున్న ఆ జంటను అదే మార్గంలో ఉన్న ఓ వ్య‌క్తి వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశాడు. దాన్ని చూసిన ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా ఇలా ప్రయాణించినవారి వెహికిల్ వివరాలు తమకు తెలియజేసినందుకు సదరు వ్యక్తికి ధన్యవాదాలు తెలపడంతో పాటు ఇలా రూ. 11 వేల జరిమానా విధించారు. ఇంకా సినిమాలను చూసి కాపీ కొట్టవద్దని, సురక్షితంగా వెహికిల్ నడిపి సురక్షితంగా ఉండమని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పోలీస్ ట్వీట్..

వైరల్ వీడియోకి ఢిల్లీ పోలీస్ స్పందన..

కాగా, వైరల్ అవుతున్న వీడియోలోని సదరు ప్రేమ జంటకు జరిమానా విధిస్తే సరిపోదని, పైగా వారు హెల్మెట్ కూడా లేకుండా బైక్ మీద వెళ్తున్నారని, వారికి శిక్ష పడితేనే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగవని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..