#BOYCOTTSonyTV: అఫ్తాబ్‌-శ్రద్ధా హత్యోదంతాన్ని తప్పుగా ప్రచారం చేస్తోన్న సోనీ టీవీ.. అసలు విషయం అదేనంటూ నెటిజన్ల ఆగ్రహం..

సామాజిక మాద్యమాల్లో బాయ్‌కాట్‌ సోనీ టీవీ (#BOYCOTTSonyTV) అనే హ్యష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సోనీ టీవీని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ అనేక మంది నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమంటే..

#BOYCOTTSonyTV: అఫ్తాబ్‌-శ్రద్ధా హత్యోదంతాన్ని తప్పుగా ప్రచారం చేస్తోన్న సోనీ టీవీ.. అసలు విషయం అదేనంటూ నెటిజన్ల ఆగ్రహం..
Boycott Sony TV trending on social media
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2023 | 7:46 PM

సామాజిక మాద్యమాల్లో బాయ్‌కాట్‌ సోనీ టీవీ (#BOYCOTTSonyTV) అనే హ్యష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సోనీ టీవీని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ అనేక మంది నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను షేర్‌ చేస్తున్నారు. ఇంతకీ విషయమేమంటే.. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ ఛానెల్‌లో క్రైమ్ పెట్రోల్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సమాజంలో జరుగుతున్న నేరాల నుంచి తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పించడమే ఈ షో ముఖ్య ఉద్ధేశ్యం. అందుకే అన్ని వయసుల వారి నుంచి ఈ షోకు విశేష ఆదరణ లభించింది. ఐతే తాజాగా ఈ షోలో వివాదాస్పద ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి.

శ్రద్ధా వాకర్‌ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రదాన నిందితుడైన అఫ్తాబ్‌.. శ్రద్ధా వాకర్‌ను హత్య చేసి, మృత దేహాన్ని 35 ముక్కలు చేసి భిన్న ప్రాంతాల్లో విసిరేశాడు. నెలలుగా దర్యాప్తుసాగుతోన్న ఇప్పటికీ ఈ కేసు ఓకొలిక్కిరాలేదు. ఐతే సోనీ టీవీలో ప్రాసారమైన క్రైమ్ పెట్రో తాజా ఎపిసోడ్‌లో అఫ్తాబ్‌-శ్రద్ధా హత్యోదంతాన్ని ‘అహ్మదాబాద్-పూణే మర్డర్‌’ పేరుతో తప్పుడు వివరాలను ప్రస్తావించారు. నిజానికి ఈ స్టోరీ శ్రద్ధా-అఫ్తాబ్‌లది. ఈ షోలో శ్రద్ధా, అఫ్తాబ్‌ల మతాన్ని కూడా మార్చేశారు. శ్రద్ధను అనా ఫెర్నాండెజ్ అనే క్రిస్టియన్ అమ్మాయిగా చూపించారు. ఇక శ్రద్ధను అత్యంత కౄరంగా హత్య చేసిన అఫ్తాబ్‌కు హిందూ పేరు పెట్టారు. పెళ్లి తర్వాత నిందితుడు అనా ఫెర్నాండెజ్ ను కొడుతున్నట్లు చూపారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా నిందితుడు వృత్తిరీత్యా యోగా టీచర్అని, అతని తల్లి మతాచారాలను పాటించే సంప్రదాయ మహిళగా డిసెంబర్ 27న ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో చూపారు. దీంతో ఈ ఎపిసోడ్‌లో హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారని యూజర్లు అంటున్నారు. వాస్తవంగా జరిగిన విషయాలేమీ ప్రస్తావించకుండా ఈ కేసును తప్పుదోవ పట్టించేలా తప్పుడు వివరాలను క్రైమ్ పెట్రో టీవీ ప్రోగ్రాంలో చూపారు.

దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు #BOYCOTTSonyTVను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తున్నారు. మొత్తం హత్యాకాండ నేపథ్యాన్ని మార్చివేసి, హిందువులపై ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.