Tea Leaves Benefits: టీ చేసిన తరువాత పొడిని పడేస్తున్నారా? దాని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మన దేశంలో టీ తాగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా టీ పెడుతుంటారు. టీ తయారీలో కొందరు ఫౌడర్ వినియోగిస్తే.. మరికొందరు తేయాకులను ఉపయోగిస్తారు. టీ సువాన పెరగడానికి టీ ఆకులను ఉపయోగిస్తారు.

Tea Leaves Benefits: టీ చేసిన తరువాత పొడిని పడేస్తున్నారా? దాని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Tea
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 24, 2023 | 10:31 PM

మన దేశంలో టీ తాగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా టీ పెడుతుంటారు. టీ తయారీలో కొందరు ఫౌడర్ వినియోగిస్తే.. మరికొందరు తేయాకులను ఉపయోగిస్తారు. టీ సువాన పెరగడానికి టీ ఆకులను ఉపయోగిస్తారు. దీంతో టీ రుచి పెరుగుతుంది. టీ లో కెఫిన్ ఉండటం వల్ల ఇది శరీరానికి శక్తిని అందజేస్తుంది. అయితే, సాధారణంగా ప్రతి ఇంట్లో టీ చేసిన తరువాత టీ ఆకులను పారేస్తారు. తద్వారా అది నిరుపయోగంగా మారుతుంది. అయితే, వేస్ట్ అనుకుని పడేసే టీ ఆకుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకకుందాం..

టీ ఆకులను శుభ్రం చేయాలి..

ఉపయోగించిన టీ ఆకులను వినియోగించే ముందు.. వాటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఆ తరువాత టీ ఆకులను వినియోగించడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. జుట్టు కండీషనర్‌గా..

టీ చేసిన తరువాత మిగిలిన టీ ఆకులను జుట్టుకు సహజనమైన కండీషనర్‌గా ఉపయోగించవచ్చు. అయితే, టీ ఆకులను నేచురల్ కండీషనర్‌గా ఉపయోగించడానికి ఆకులను మరోసారి ఉడకబెట్టి, ఆ నీటితో జుట్టును కడగాలి.

ఇవి కూడా చదవండి

2. ఈగ నివారణకు..

ఈగలను వదిలించుకోవడానికి టీ ఆకులు కూడా ఉపకరిస్తాయి. ఈగలతో ఇబ్బంది పడుతుంటే.. టీ ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటితో ఇంటి మొత్తాన్ని తుడవాలి. దీంతో ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

3. గాయాలు నయం చేస్తాయి..

టీ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గాయాలను నయం చేయడంలో సహాయపడుతాయి. ఆకులను సరిగ్గా శుభ్రం చేసిన తరువాత నీటిలో ఉడకబెట్టాలి. చల్లారిన తరువాత ఆ నీటిని గాయంపై అప్లై చేయాలి. ఇది గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.

4. వంట గిన్నెల శుభ్రం చేయడానికి..

వంట పాత్రలపై ఉండే బలమైన నూనె మరకలను తొలగించడంలో ఇది ఉపకరిస్తుంది. బాగా నూనె మరకలు అంటిన గిన్నెల్లో టీ ఆకులను బాగా ఉడకబెట్టాలి. ఆ తరువాత.. మురికి పాత్రలను శుభ్రం చేస్తే క్లీన్ అవుతాయి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారాన్ని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..