Late-Night Eating: రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..

వేళకు భోజనం చేయకపోవడం ఆరోగ్యానికి హాని తలపెట్టే అలవాట్లలో ప్రధానమైనవి. ప్రతి రోజు మనకు సరైన తిండి, నిద్ర లేకపోతే మన శరీరం నెమ్మదిగా జబ్బుపడుతుంది. అందునా అర్థరాత్రి డిన్నర్ చేయడం వల్ల..

Late-Night Eating: రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..
Eating
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 16, 2023 | 7:15 PM

వేళకు భోజనం చేయకపోవడం ఆరోగ్యానికి హాని తలపెట్టే అలవాట్లలో ప్రధానమైనవి. ప్రతి రోజు మనకు సరైన తిండి, నిద్ర లేకపోతే మన శరీరం నెమ్మదిగా జబ్బుపడుతుంది. అందునా అర్థరాత్రి డిన్నర్ చేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్న వేళల్లో కాస్త ఆలస్యంగా భోజనం చేసినా ఇబ్బంది ఉండదు.. కానీ రోజూ రాత్రి వేళ మాత్రం టైం ప్రకారం తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. వీలైనంత వరకు రాత్రి 8 గంటలలోపు భోజనం చేయాలి. ఆ తర్వాత భోజనం చేయడం ఆరోగ్యానికి అన్ని విధాలా హానికరమట. అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, శరీరంలోని జీవక్రియలు నెమ్మదిగా పనిచేయడం మొదలవుతుంది. రాత్రి తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అయితేనే మంచి నిద్ర పడుతుంది. భోజనానికి మనం పడుకునే సమయానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండాలి. లేదంటే నిద్ర సంబంధిత సమస్యలు ప్రారంభమవుతాయి. అందుకే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది.

రాత్రి సమయంలో 8 గంటల లోపు భోజనం చేయకపోతే పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయి, రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ ముప్పును తప్పించుకోవాలంటే వేళకు భోజనం చేయడమే చక్కని పరిష్కార మార్గం. అలాగే అల్సర్, ఎసిడిటి వంటి సమస్యలు కూడా పొంచి ఉంటాయి. జీర్ణక్రియ సవ్యంగా జరగాలంటే సమయానికి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి డిన్నర్‌లో త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకుంటే బెటర్‌ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఘాటైన మసాలాలు, కారం ఎక్కువగా తినటం, వ్యాయామం చేయకపోవటం, మద్యం అలవాటు, పొగ తాగటం వంటి వాటికి దూరంగా ఉండాలి. రాత్రి భోజనంలో పండ్లు, సలాడ్లు, జ్యూస్‌లు ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.