ఈసారి వీకెండ్ డిఫరెంట్‌గా ప్లాన్ చేద్దామనుకుంటున్నారా? కుటుంబంతో కలిసి ఏదైనా లాంగ్ టూర్, అది కూడా ఆధ్మాత్మిక పర్యటనకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మూడు రోజుల్లో మూడు ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టేసి రావొచ్చు. షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వరం ప్రాంతాలను తిరిగి రావొచ్చు. దీనికోసం ఐఆర్‌సీటీసీ టూరిజమ్ విభాగం ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో దీనిని ఏర్పాటు చేసింది. సాయి శివం పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ కేవలం రూ. 4,530కే అందుబాటులో ఉంది. ఐఆర్‌సీటీసీనే రైలులో తీసుకెళ్లి, తీసుకొచ్చే ఈ టూర్ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డే1(శుక్రవారం): సాయంత్రం 18.50కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్(17064)లో బయలుదేరి వెళ్తారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
డే2(శనివారం): ఉదయం 07:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. స్టేషన్లో ఐఆర్‌సీటీసీ సిబ్బంది మిమ్మల్ని షిర్డీలోని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన అయ్యి, అల్పాహారం చేశాక మీ సొంత ఖర్చులతో షిర్డీ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇది హోటల్ నుంచి నడిచి వెళ్లే అంత దూరంలోనే ఉంటుంది. సాయంత్రం షిర్డీలో ఖాళీ సమయం ఉంటుంది. మీకు ఆసక్తి ఉంటే శనిషింగ్నాపూర్ ను మీ సొంత ఖర్చులతో సందర్శించి రావొచ్చు. రాత్రికి షిర్డీలో బస చేస్తారు.
డే3(ఆదివారం): ఉదయం హోటల్ చెక్ అవుట్ చేసి షిర్డీ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ బయలుదేరుతారు. అక్కడ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత నాసిక్‌లోని పంచవటి వద్దకు వెళ్తారు. ఇక్కడ కార్లు ఇతర పెద్ద వాహనాలు అనుమతించరు. పర్యాటకులు సందర్శనా స్థలాలను కవర్ చేయడానికి ఆటో-రిక్షాల వంటి స్థానిక రవాణాను ఉపయోగించాల్సి ఉంటుంది. అనంతరం నాగర్‌సోల్ స్టేషన్‌లో సాయంత్రం 20:30 మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. రాత్రి 21.20గంటలకు అజంతా ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 17063) తిరుగు ప్రయాణం మొదలువుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
డే4(సోమవారం): ఉదయం 8.50గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
రైలులో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ టికెట్టు చార్జీలు, లోకల్లో ప్రయాణానికి ఏసీ వాహన సదుపాయం, రెండు రోజులు అల్పాహారం, ట్రావెల్ ఇన్సురెన్స్ ఉంటాయి. అయితే దేవాలయాల్లో దర్శన టికెట్లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ప్యాకేజీలో ఉండదు సొంతంగా సమకూర్చుకోవాలి. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..