Health Tips: రక్తహీనతతో బాధపడుతున్నారా.. వెంటనే, ఈ 4 జ్యూస్‌లు తాగితే సరి..

Anemia Prevention Tips: రక్తహీనతతో బాధపడుతుంటే, వేసవి కాలంలో ఏలాంటివి తినాలి, తాగాలోనని అయోమయంలో ఉన్నారా. అందుకే మీకోసం ఈ 4 జ్యూస్‌లను తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: రక్తహీనతతో బాధపడుతున్నారా.. వెంటనే, ఈ 4  జ్యూస్‌లు తాగితే సరి..
Anemia
Follow us
Venkata Chari

|

Updated on: May 01, 2022 | 7:15 AM

శరీరంలో రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. రక్తహీనత(Anemia) కారణంగా, ఒక వ్యక్తి చాలా బలహీనంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి వారు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, వారి శరీరం లోపల జీవం ఉండదు. కొన్నిసార్లు బలహీనత చాలా ఎక్కువగా ఉంటుంది. కళ్ళు, చర్మం రంగు పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. అలాగే గోర్లు తెల్లగా, పొడిగా, గరుకుగా కనిపిస్తాయి. రక్తహీనత ప్రధానంగా శరీరంలో ఇనుము, పోషకాల కొరత కారణంగా సంభవిస్తుంది. కానీ, కొన్ని తీవ్రమైన వ్యాధులు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. ఈ విషయంలో పూర్తి పరీక్ష తర్వాత డాక్టర్లు మాత్రమే సరైన సలహా ఇవ్వగలరు. ఎందుకంటే రక్తహీనతకు కారణం ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం(Summer) నడుస్తోంది. ఈ సమయంలో కుటుంబంలో ఎవరైనా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు ప్రతిరోజూ ఈ నాలుగు జ్యూస్‌(juices)లలో ఏదైనా ఒక రసాన్ని తీసుకోవచ్చు. అయితే, ఇందులో మీకు నచ్చిన రుచిని ఎంచుకోవచ్చు. ఈ రసాలన్నీ శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడం ద్వారా రక్తహీనతను తొలగించడానికి పని చేస్తాయి.

1. అలోవెరా జ్యూస్..

అలోవెరా ఒక అద్భుతమైన హెర్బ్. దీని వినియోగం లేదా చర్మం, జుట్టుపై ఉపయోగించడం ఎల్లప్పుడూ ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

2. ద్రాక్షపండు రసం..

ద్రాక్షను అలాగే తినొచ్చు. లేదా వాటి రసాన్ని నల్ల ఉప్పు వేసి తాగవచ్చు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచి హిమోగ్లోబిన్‌ను పెంచేందుకు ద్రాక్ష సహకరిస్తుంది.

3. మామిడికాయను తినడం..

పండిన మామిడిపండ్లు శరీరంలోని రక్తహీనతను తొలగిస్తాయి. ప్రతిరోజూ మామిడిపండు తినండి. మామిడి పండు తిన్న రెండు గంటల తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగండి. శరీరంలో రక్తం లేకపోవడమన్నదే ఇంకెప్పుడు వినరు.

4. దుంప రసం..

బీట్‌రూట్‌లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని రక్తహీనతను తొలగించే చర్చ వచ్చినప్పుడల్లా, బీట్‌రూట్ ఖచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది. మీరు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసి తాగవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోండి.  TV9Telugu వీటిని నిర్ధారించలేదు. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, వైద్యుడిని సంప్రదించడం మంచింది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Roasted Onions: కాల్చిన ఉల్లిపాయలు తింటున్నారా ?.. అయితే మీరు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..

Health Tips: మీరు చేస్తున్న ఈ 4 తప్పుల వల్లే అధిక బరువు.. అస్సలు చేయవద్దు..!