Cancer Risk Factors: ఈ కారణాలతోనే క్యాన్సర్ వ్యాప్తి.. అజాగ్రత్తగా ఉంటే ప్రాణానికే ప్రమాదం..
ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 2020 సంవత్సరంలో ప్రతి 6 మరణాలలో 1 మరణం క్యాన్సర్ తోనే సంభవిస్తుందని డబ్లూహెచ్ఓ పేర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. మన శరీరంలో పెరుగుతున్న కణాలు నియంత్రణ కోల్పోయి, ఇష్టానుసారంగా ఒక గుంపు మాదిరి ఒకే దగ్గర పెరగడాన్ని కేన్సర్ అంటారు. సాధారణంగా కణాలు విభజనకు గురై పుడుతూ, మరణిస్తుంటాయి. అయితే.. ఇక్కడ కొత్త సెల్స్ తయారై ఒక గుంపుగా కణితులుగా మారుతాయి. వీటిని ట్యూమర్ అంటారు. ఇది కణజాలాలు, అవయవాలకు కూడా వ్యాపించవచ్చు. అంతేకాకుండా శరీరం సాధారణ పనితీరుకు కూడా ఆటంకం కలిగిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 2020 సంవత్సరంలో ప్రతి 6 మరణాలలో 1 మరణం క్యాన్సర్ తోనే సంభవిస్తుందని డబ్లూహెచ్ఓ పేర్కొంటోంది. కొత్త క్యాన్సర్ చికిత్సలను పరీక్షించడానికి నిపుణులు ప్రతిరోజూ కష్టపడుతున్నారు. కానీ ఇప్పటివరకు ఖచ్చితమైన నివారణ మాత్రం కనుగొనలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. అందుకే శత్రువుకు కూడా క్యాన్సర్ వంటి వ్యాధి రాకూడదని ప్రజలు తరచుగా ప్రార్థిస్తుంటారు. జీవనశైలి, అనేక చెడు అలవాట్ల వల్ల ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడతారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
క్యాన్సర్‌కు ప్రధాన కారణం మీ కణాల మ్యుటేషన్ లేదా దాని DNAలో మార్పులు. మీ జన్యు ఉత్పరివర్తనలు వారసత్వంగా పొందవచ్చు. అవి పుట్టిన తర్వాత లేదా పర్యావరణ శక్తుల వల్ల కూడా కావచ్చు. ఇప్పుడు జన్యుపరమైన కారణాలను నివారించడం కష్టం, కానీ కొన్ని బాహ్య కారణాలను మాత్రం నివారించవచ్చు.
క్యాన్సర్ యొక్క బాహ్య కారణాలను కార్సినోజెన్స్ అంటారు. ఇవి క్రింది విధంగా ఉన్నాయి..
- రేడియేషన్ – అతినీలలోహిత కాంతి వంటి భౌతిక క్యాన్సర్ కారకాలు
- సిగరెట్ పొగ, ఆల్కహాల్, ఆస్బెస్టాస్ డస్ట్, వాయు కాలుష్యం, కలుషితమైన ఆహారం, తాగునీరు వంటి రసాయన క్యాన్సర్ కారకాలు
- వైరస్లు, బాక్టీరియా, పరాన్నజీవులు వంటి జీవసంబంధమైన క్యాన్సర్ కారకాలు
క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. దాదాపు 33% క్యాన్సర్ మరణాలు పొగాకు, ఆల్కహాల్, అధిక (BMI) ఊబకాయం, శరీరంలో కొవ్వు పెరగడం అని పేర్కొంది. తక్కువ పండ్లు, కూరగాయల వినియోగం, తగినంత శారీరక శ్రమ లేని కారణంగా క్యాన్సర్ సంభవిస్తుందని తెలిపింది.
క్యాన్సర్ లో ఎన్నో రకాలున్నాయి. వైద్యులు ఇప్పటికే పలు రకాల క్యాన్సర్లకు చికిత్సను అందిస్తున్నారు.
క్యాన్సర్ రకాలు..
అపెండిక్స్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, మెదడు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, చెవి క్యాన్సర్, గుండె క్యాన్సర్, మూత్రపిండ లేదా మూత్రపిండాల క్యాన్సర్, లుకేమియా, పెదవుల క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లింఫోమా, నోటి క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, చిన్న ప్రేగు క్యాన్సర్, ప్లీహ క్యాన్సర్ – యోని క్యాన్సర్, వృషణ క్యాన్సర్, కడుపు క్యాన్సర్ లాంటివి ఉన్నాయి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..