Vidyut Jammwal: బ్రేకప్ చెప్పుకున్న మరో ప్రేమ జంట.. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి రద్దు

|

Mar 23, 2023 | 6:24 PM

అలాగే పెళ్లికి ముందే.. విడిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారు. కొంతమంది లవ్ స్టేజ్ లోనే బ్రేకప్ చెప్పుకున్న వాళ్లు ఉన్నారు. అలాగే ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లిన వాళ్ళు కూడా రద్దు చేసుకున్నారు.

Vidyut Jammwal: బ్రేకప్ చెప్పుకున్న మరో ప్రేమ జంట.. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి రద్దు
Vidyut Jammwal
Follow us on

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో చాలా మంది జంటలు విడిపోతున్నారు. పెళ్లి చేసుకున్న జంటలు చాలా మంది విడిపోయారు. అలాగే పెళ్లికి ముందే.. విడిపోయిన బ్యాచ్ కూడా ఉన్నారు. కొంతమంది లవ్ స్టేజ్ లోనే బ్రేకప్ చెప్పుకున్న వాళ్లు ఉన్నారు. అలాగే ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లిన వాళ్ళు కూడా రద్దు చేసుకున్నారు. ఇటీవలే టాలీవుడ్ లో సమంత నాగ చైతన్య, ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇలా చాలా మంది వున్నారు. తాజాగా మరో హీరో కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. ఏకంగా ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకున్నాడు ఆ హీరో. ఇంతకు అతను ఎవరంటే.. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్.

ఈ వర్సటైల్ యాక్టర్ తాజాగా తన లవర్ కు బ్రేకప్ చెప్పాడు. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ, సికిందర్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు విద్యుత్. అలాగే బాలీవుడ్ లో హీరోగా నటిస్తున్నాడు విద్యుత్ జమ్వాల్.

విద్యుత్‌ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి చట్టపట్టాలేసుకు తిరిగారు కూడా.. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ ఇద్దరు విడిపోతున్నటు తెలుస్తోంది. ఇటీవల వీరు విడివిడిగా కనిపిస్తున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్‌ చేశారు. దాంతో ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.