Allu Arjun: ‘కంగ్రాట్స్ బావ.. ఈ అవార్డ్ నీకు రావాల్సిందే’.. అల్లు అర్జున్‏కు ఎన్టీఆర్, చిరంజీవి స్పెషల్ విషెస్..

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. ఇందులో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో బన్నీ మ్యానరిజం, డైలాగ్స్ కు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

Allu Arjun: 'కంగ్రాట్స్ బావ.. ఈ అవార్డ్ నీకు రావాల్సిందే'.. అల్లు అర్జున్‏కు ఎన్టీఆర్, చిరంజీవి స్పెషల్ విషెస్..
Allu Arjun, Jrntr, Megastar
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2023 | 7:37 PM

దాదాపు 68 ఏళ్ల జాతీయ ఫిల్మ్ అవార్డుల్లో ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవం అల్లు అర్జున్‏కు దక్కింది. పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. “కంగ్రాచ్యులేషన్స్ బావ. పుష్ప సినిమాగానూ ఈ విజయం, అవార్డ్స్ నీకు దక్కి తీరాల్సిందే” అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక బన్నీకి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు.

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. ఇందులో బన్నీ స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాలో బన్నీ మ్యానరిజం, డైలాగ్స్ కు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

“నా ప్రియమైన బన్నీకి హృదయాపూర్వక అభినందనలు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నందుకు నీగురించి ఎంతో గర్వపడుతున్నాను” అంటూ బన్నీకి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు చిరంజీవి. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ కు కూడా అభినందనలు తెలిపారు.

“పుష్ప.. తగ్గేదే లే.. శుభాకాంక్షలు బన్నీ” అంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్.. మొత్తం పుష్ప టీంకు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు.

“పుష్ప రాజ్.. శుభాకాంక్షలు బన్నీ అన్నా.. తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ కు విషెస్ తెలిపారు హీరో విజయ్ దేవరకొండ.

పుష్ప రాజ్.. అస్సలు తగ్గేదే లే.. శుభాకాంక్షలు. పార్టీ టైమ్ అంటూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.