ప్రముఖ బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేం కీర్తీ భట్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ప్రముఖ నటుడు విజయ్ కార్తీక్‌తో కలిసి జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఆదివారం కీర్తీ భట్- విజయ్‌ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. పలువురు బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌లో సందడి చేశారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన కీర్తి తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి బుల్లితెర ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 6లోనూ సందడి చేసింది. ఆ సీజన్‌లో టాప్ 3 కంటెస్టెంట్‌గా అందరి మనసులు గెల్చుకుంది.
ఇక కీర్తికి కాబోయే వరుడు విజయ్ కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లి అతని స్వగ్రామం. మొదట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అయితే సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మొదట కన్నడ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత తెలుగులోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ అనే సినిమాల్లో మెరిశాడు. కీర్తి- విజయ్‌ల ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కు హాజరైన వారిలో బాలాదిత్య, ఆదిరెడ్డి తదితరులు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.