ఇటీవల మలయాళ సినిమాలు వరుసగా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి. కొన్ని థియేటర్లలో రిలీజవుతుంటే, మరికొన్ని డైరెక్టుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. హృద్యమైన కథా కథనాలతో కూడుకున్న మలయాళీ మూవీస్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటవల రిలీజైన 2018, నెయ్‌మార్, పద్మినీ వంటి సినిమాలు ఇందుకు పెద్ద ఉదాహరణ. తాజాగా మరో మలయాళ సూపర్ హిట్ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అదే మధుర మనోహర మోహం. ఇందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజతో కలిసి నటించిన రజీషా విజయన్ కీ రోల్ పోషించింది. అలాగే షరాఫ్ యుధీన్, బిందు పనికర్, ఆర్ష చాందిని, బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. స్టెఫీ జేవియర్ ఈ క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీకి దర్శకత్వం వహించారు. జూన్ 13న అక్కడ థియేటర్లలో విడుదలైన మధుర మనోహర మోహం మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తల్లి, ముగ్గురు తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధాలను చక్కగా చూపించారీ సినిమాలో. చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన మధుర మనోహర మోహం ఏకంగా రూ. 10కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. అలా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘హెచ్ ఆర్’ సంస్థ మధుర మనోహర మోహం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మంగళవారం (ఆగస్టు 22) అర్ధరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. బీ3ఎమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన మధుర మనోహర మోహం సినిమాకు మహేష్, గోపాల్, జై విష్ణు కథా సహకారం అందించారు. సెల్వరాజ్ చంద్రు సినిమాటోగ్రఫీ అందించగా, హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చారు.
#MadhuraManoharaMoham
an abundance of relatable & humorous moments that evoke genuine laughter. #stephyZaviour who offers a heartwarming slice-of-life movie that is a family entertainer.@rajisha_vijayan @Aarsha_Baiju @actorsharafu pic.twitter.com/APzfjB3qDZ— Bhanu Teja Kondapaturi (@BhanuTeja91221) August 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..