Kabzaa OTT Date: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న పాన్‌ ఇండియా మూవీ కబ్జా.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

|

Mar 27, 2023 | 6:38 PM

ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన చిత్రం కబ్జా. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా పునీత్ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా మార్చి 17వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా..

Kabzaa OTT Date: ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న పాన్‌ ఇండియా మూవీ కబ్జా.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..
Kabzaa Ott
Follow us on

ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన చిత్రం కబ్జా. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా పునీత్ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా మార్చి 17వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా మరో కేజీఎఫ్‌ అవతుందని అంతా భావించారు. సినిమా ట్రైలర్‌ కూడా చిత్రంపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

ఈ క్రమంలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. సుమారు రూ. 110 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్‌లో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కబ్జా మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ తీసుకుంది. సినిమా థియేటర్లలో వచ్చిన 25 రోజుల్లోనే ఏప్రిల్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్నట్లు సమాచారం. తెలుగు భాషలో కూడా ఇదే రోజు నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అమెజాన్‌ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఉంటే ఈ చిత్రాన్ని రూ. 110 కోట్లతో భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇందులో శ్రియా హీరోయిన్‌గా నటించగా కిచ్చా సుదీప్‌ కీలకపాత్ర పోషించారు. కాంతార, కేజీఎఫ్‌లాంటి సినిమాల సరసన కబ్జా కూడా చేరుతుందని చాలా మంది భావించారు. కానీ కబ్జా మూవీ ఫలితం మాత్రం రివర్స్‌ అయ్యింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..