ఉత్తర ప్రదేశ్ లోక్‌ సభ నియోజకవర్గాలు ఎన్నికల ఫలితాలు - Uttar Pradesh Lok Sabha Election Constituencies Wise Result

రాజకీయ కోణం నుండి ఉత్తరప్రదేశ్ దేశంలో అత్యంత ప్రాధాన్య రాష్ట్రంగా పరిగణించబడుతుంది. ఈ రాష్ట్రానికి చారిత్రక, పౌరాణిక, సాంస్కృతిక పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరప్రదేశ్ ఇతిహాసాలు, పవిత్ర నదులు, పురాతన నగరాలు, తీర్థయాత్రలకు పేరుగాంచింది. 2011 జనాభా లెక్కల మేరకు 19.95 కోట్ల మంది జనాభాతో దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు ప్రపంచంలో 5 మాత్రమే ఉన్నాయి. అవి- చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలు. ఆ రాష్ట్రానికి లక్నో రాజధానిగా ఉంది.

రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహావీరుల కాలం నుండి రాష్ట్రం సాంస్కృతిక, మేధో ప్రతిభకు కేంద్రంగా ఉంది. ఆధునిక కాలంలో యూపీ రాష్ట్రం ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక కారిడార్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, విద్యా, వైద్య నైపుణ్యాల కేంద్రాలు, స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతిదారుల నెట్‌వర్క్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు ఛోదకశక్తిగా ఎదుగుతోంది.

దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ గెలిచిన పార్టీలు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారణాసితో పాటు రాజధాని లక్నో, అయోధ్య, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర, గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్, కన్పూర్ ఆ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు.

ఉత్తర ప్రదేశ్ లోక్‌సభ స్థానాల జాబితా

రాష్ట్రం సీటు అభ్యర్థి పేరు ఓటు పార్టీ స్థితి
Uttar Pradesh Kannauj AKHILESH YADAV 642292 SP Won
Uttar Pradesh Mirzapur ANUPRIYA PATEL 471631 ADAL Won
Uttar Pradesh Ghaziabad ATUL GARG 854170 BJP Won
Uttar Pradesh Amroha KANWAR SINGH TANWAR 476506 BJP Won
Uttar Pradesh Aonla NEERAJ MAURYA 492515 SP Won
Uttar Pradesh Firozabad AKSHAY YADAV 543037 SP Won
Uttar Pradesh Mainpuri DIMPLE YADAV 598526 SP Won
Uttar Pradesh Badaun ADITYA SINGH YADAV 501855 SP Won
Uttar Pradesh Amethi KISHORI LAL SHARMA 539228 INC Won
Uttar Pradesh Etawah JITENDRA KUMAR DOHARE 490747 SP Won
Uttar Pradesh Dhaurahra ANAND BHADAURIYA 443743 SP Won
Uttar Pradesh Sitapur RAKESH RATHOR 531138 INC Won
Uttar Pradesh Jhansi ANURAG SHARMA 690316 BJP Won
Uttar Pradesh Rae Bareli RAHUL GANDHI 687649 INC Won
Uttar Pradesh Banda KRISHNA DEVI SHIVSHANKER PATEL 406567 SP Won
Uttar Pradesh Sultanpur RAMBHUAL NISHAD 444330 SP Won
Uttar Pradesh Ghazipur AFZAL ANSARI 539912 SP Won
Uttar Pradesh Kanpur RAMESH AWASTHI 443055 BJP Won
Uttar Pradesh Fatehpur NARESH CHANDRA UTTAM PATEL 500328 SP Won
Uttar Pradesh Bahraich ANAND KUMAR 518802 BJP Won
Uttar Pradesh Kaiserganj KARAN BHUSHAN SINGH 571263 BJP Won
Uttar Pradesh Nagina CHANDRASHEKHAR 512552 ASPKR Won
Uttar Pradesh Deoria SHASHANK MANI TRIPATHI 504541 BJP Won
Uttar Pradesh Salempur RAMASHANKAR RAJBHAR 405472 SP Won
Uttar Pradesh Jaunpur BABU SINGH KUSHWAHA 509130 SP Won
Uttar Pradesh Machhlishahr PRIYA SAROJ 451292 SP Won
Uttar Pradesh Maharajganj PANKAJ CHAUDHARY 591310 BJP Won
Uttar Pradesh Gorakhpur RAVINDRA SHYAMNARAYAN SHUKLA URF RAVI KISHAN 585834 BJP Won
Uttar Pradesh Ballia SANATAN PANDEY 467068 SP Won
Uttar Pradesh Baghpat DR RAJKUMAR SANGWAN 488967 RLD Won
Uttar Pradesh Chandauli BIRENDRA SINGH 474476 SP Won
Uttar Pradesh Bhadohi DR. VINOD KUMAR BIND 459982 BJP Won
Uttar Pradesh Pratapgarh SHIV PAL SINGH PATEL (DR. S P SINGH) 441932 SP Won
Uttar Pradesh Gautam Buddha Nagar MAHESH SHARMA 857829 BJP Won
Uttar Pradesh Ambedkar Nagar LALJI VERMA 544959 SP Won
Uttar Pradesh Domariyaganj JAGDAMBIKA PAL 463303 BJP Won
Uttar Pradesh Moradabad RUCHI VIRA 637363 SP Won
Uttar Pradesh Akbarpur DEVENDRA SINGH ALIAS BHOLE SINGH 517423 BJP Won
Uttar Pradesh Fatehpur Sikri RAJKUMAR CHAHAR 445657 BJP Won
Uttar Pradesh Aligarh SATISH KUMAR GAUTAM 501834 BJP Won
Uttar Pradesh Kushi Nagar VIJAY KUMAR DUBAY 516345 BJP Won
Uttar Pradesh Rampur MOHIBBULLAH 481503 SP Won
Uttar Pradesh Bansgaon KAMLESH PASWAN 428693 BJP Won
Uttar Pradesh Agra PROF S P SINGH BAGHEL 599397 BJP Won
Uttar Pradesh Faizabad AWADHESH PRASAD 554289 SP Won
Uttar Pradesh Robertsganj CHHOTELAL 465848 SP Won
Uttar Pradesh Mathura HEMA MALINI 510064 BJP Won
Uttar Pradesh Etah DEVESH SHAKYA 475808 SP Won
Uttar Pradesh Shahjahanpur ARUN KUMAR SAGAR 592718 BJP Won
Uttar Pradesh Allahabad UJJWAL REVATI RAMAN SINGH 462145 INC Won
Uttar Pradesh Gonda KIRTI VARDHAN SINGH ALIAS RAJA BHAIYA 474258 BJP Won
Uttar Pradesh Bulandshahr DR BHOLA SINGH 597310 BJP Won
Uttar Pradesh Bijnor CHANDAN CHAUHAN 404493 RLD Won
Uttar Pradesh Sambhal ZIA UR REHMAN 571161 SP Won
Uttar Pradesh Bareilly CHHATRA PAL SINGH GANGWAR 567127 BJP Won
Uttar Pradesh Lucknow RAJNATH SINGH 612709 BJP Won
Uttar Pradesh Sant Kabir Nagar LAXMIKANT PAPPU NISHAD 498695 SP Won
Uttar Pradesh Ghosi RAJEEV RAI 503131 SP Won
Uttar Pradesh Pilibhit JITIN PRASADA 607158 BJP Won
Uttar Pradesh Misrikh ASHOK KUMAR RAWAT 475016 BJP Won
Uttar Pradesh Hamirpur AJENDRA SINGH LODHI 490683 SP Won
Uttar Pradesh Barabanki TANUJ PUNIA 719927 INC Won
Uttar Pradesh Kheri UTKARSH VERMA (MADHUR) 557365 SP Won
Uttar Pradesh Mohanlalganj R K CHAUDHARY 667869 SP Won
Uttar Pradesh Phulpur PRAVEEN PATEL 452600 BJP Won
Uttar Pradesh Jalaun NARAYAN DAS AHIRWAR 530180 SP Won
Uttar Pradesh Meerut ARUN GOVIL 546469 BJP Won
Uttar Pradesh Unnao SAKSHI MAHARAJ 616133 BJP Won
Uttar Pradesh Lalganj DAROGA PRASAD SAROJ 439959 SP Won
Uttar Pradesh Muzaffarnagar HARENDRA SINGH MALIK 470721 SP Won
Uttar Pradesh Kairana IQRA CHOUDHARY 528013 SP Won
Uttar Pradesh Shrawasti RAM SHIROMANI 511055 SP Won
Uttar Pradesh Kaushambi PUSHPENDRA SAROJ 509787 SP Won
Uttar Pradesh Azamgarh DHARMENDRA YADAV 508239 SP Won
Uttar Pradesh Saharanpur IMRAN MASOOD 547967 INC Won
Uttar Pradesh Varanasi NARENDRA MODI 612970 BJP Won
Uttar Pradesh Farrukhabad MUKESH RAJPUT 487963 BJP Won
Uttar Pradesh Hathras ANOOP PRADHAN BALMIKI 554746 BJP Won
Uttar Pradesh Hardoi JAI PRAKASH 486798 BJP Won
Uttar Pradesh Basti RAM PRASAD CHAUDHARY 527005 SP Won

దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. విస్తీర్ణం పరంగా చూసుకుంటే దేశంలో నాలుగో స్థానంలో ఉంది. లక్నో, ఆగ్రా, అయోధ్య, అలీఘర్, కాన్పూర్, ఝాన్సీ, వారణాసి, గోరఖ్‌పూర్, మధుర మొదలైనవి ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు. ఉత్తర ప్రదేశ్ ఈశాన్యంలో నేపాల్ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ప్రస్తుతం యూపీలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉన్నారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 24 జనవరి 1950న ఏర్పడింది. ఇందులో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు కూడా పౌరాణిక చరిత్ర ఉంది. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా పరిగణించబడే వారణాసి నగరం ఇక్కడ ఉంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఆయన వరుసగా మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నందున.. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలుపొందే పార్టీయే దేశంలో అధికారంలోకి వచ్చే ఆనవాయితీ ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 80 సీట్లలో 62 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే దక్కింది. రాహుల్ గాంధీ కూడా ఇక్కడి అమేథీ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. వీరితో పాటు జయంత్ చౌదరి, రాజ్ బబ్బర్, శివపాల్ సింగ్ యాదవ్, అక్షయ్ యాదవ్ వంటి పెద్దలు కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. నాటి ఎన్నికల్లో సమాజ్‌వాదీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేశాయి. ఈ కూటమి కేవలం 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు

ప్రశ్న - 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి వచ్చిన ఓట్ల శాతం ఎంత?

జవాబు – యూపీలో ఎన్డీయే కూటమికి 51.19% ఓట్లు వచ్చాయి.

ప్రశ్న - యూపీలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన సీటు ఏది?

సమాధానం- ఘజియాబాద్‌లో బీజేపీ అభ్యర్థి వీకే సింగ్ 5,01,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ప్రశ్న - మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు చౌదరి అజిత్ సింగ్ ఏ స్థానం నుంచి ఓడిపోయారు?

జవాబు: చౌదరి అజిత్ సింగ్ ముజఫర్‌నగర్ స్థానం నుంచి ఓడిపోయారు.

ప్రశ్న - సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్లమెంటరీ నియోజకవర్గమైన గోరఖ్‌పూర్ ఎంపీ ఎవరు?

సమాధానం- గోరఖ్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రవి కిషన్ ఎంపీగా గెలిచారు.

ప్రశ్న - ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అజంగఢ్ స్థానం నుంచి ఎవరిని ఓడించారు?

సమాధానం- బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ నిరాహువా అఖిలేష్ యాదవ్ చేతిలో ఓడిపోయారు.
 

ప్రశ్న - ఉత్తరప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలకు ఎన్ని సీట్లు రిజర్వు చేయబడ్డాయి?

జవాబు- 17 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి.

ప్రశ్న - యూపీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఓట్ల శాతం ఎంత?

జవాబు: యూపీఏ ఓట్ల శాతం 6.41%.

ప్రశ్న - యూపీలో సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ఏ సీటులో ఓడిపోయారు?

జవాబు- రాంపూర్ లోక్‌సభ స్థానం

ప్రశ్న - ఎన్నికలకు ముందు బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన కున్వర్ డానిష్ అలీ 2019లో ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు?

సమాధానం - డానిష్ అలీ అమ్రోహా నుండి ఎంపీ అయ్యారు.

ప్రశ్న - 2019 ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా యూపీలోని ఏ స్థానం నుంచి ఓడిపోయారు?

సమాధానం- ఘాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి మనోజ్ సిన్హా ఓటమి పాలయ్యారు.

ఎన్నికల వీడియో