TSPSC Group 1 Answer Key: టీఎస్పీయస్సీ గ్రూప్‌1 ప్రిలిమినరీ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 11న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఒకే షిఫ్ట్‌లో గ్రూప్‌ 1 పరీక్ష జరిగిన..

TSPSC Group 1 Answer Key: టీఎస్పీయస్సీ గ్రూప్‌1 ప్రిలిమినరీ ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోండి
TSPSC Group 1 Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 29, 2023 | 7:51 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 11న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఒకే షిఫ్ట్‌లో గ్రూప్‌ 1 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా హాజరయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల ఓఎమ్‌ఆర్‌ షీట్లను కూడా కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచింది.మొత్తం 2,33,506 ఓఎమ్‌ఆర్‌ షీట్ల డిజిటల్ స్కాన్ కాపీలు జూలై 27 సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూలై 1 నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తుంది.

అభ్యంతరాలతో పాటు, అభ్యర్థులు అందించిన లింక్‌లో పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో మూలాధారాలు, రిఫరెన్స్‌లు అప్‌లోడ్‌ చేయవల్సి ఉంటుంది. కాగా మొత్తం 503 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి నియామక పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది. తుది ఆన్సర్‌ కీ విడుదలైన నెలరోజుల్లోగా ప్రిలిమ్స్‌ ఫలితాలు ప్రకటించనున్నారు. తదుపరి మూడు నెలల వ్యవధి తర్వాత మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రైమరీ కీ, ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లను ఈ కింది లింక్‌ల ద్వారా పొందొచ్చు.

టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి. 

ఇవి కూడా చదవండి

టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 OMR షీట్ల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.