APPSC Group 1 Exam Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. 297 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8న ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా..

APPSC Group 1 Exam Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల.. 297 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
APPSC Group 1 Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 01, 2023 | 8:41 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 8న ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న18 జిల్లాల్లో మొత్తం 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ శనివారం (డిసెంబర్‌ 31) ప్రకటించింది. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇతర సమాచారం అభ్యర్ధులకు సూచించడానికి 18 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషన్‌ తెల్పింది. ఇక పరీక్ష రోజున ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో పేపర్‌కు పరీక్షలు జరగనున్నాయి.

ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మొత్తం 92 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ నెల 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్‌ పరీక్ష రాయడానికి అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.