Indian Railways: ఇక మారిపోనున్న చిన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం గురించి తెలుసా..?

Amrit Bharat Station Scheme: దేశంలో మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రప్రభుత్వం గత కొన్నేళ్లుగా అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనిలో భాగంగా పెద్ద, పెద్ద నగరాలతో పాటు.. పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించింది. దానికోసం..

Indian Railways: ఇక మారిపోనున్న చిన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు.. కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం గురించి తెలుసా..?
Indian Railway Station
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 28, 2022 | 12:16 PM

Amrit Bharat Station Scheme: దేశంలో మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రప్రభుత్వం గత కొన్నేళ్లుగా అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనిలో భాగంగా పెద్ద, పెద్ద నగరాలతో పాటు.. పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించింది. దానికోసం అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (AMRUT) పథకాన్ని అమలు చేస్తుండగా, ఇదే తరహాలో చిన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఓ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో చిన్న రైల్వే స్టేషన్లలో సైతం ప్రయాణీకులకు మౌలిక సౌకర్యాలను కల్పించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అనే కొత్త కార్యక్రమం కింద వెయ్యి ముఖ్యమైన చిన్న రైల్వేస్టేషన్లను ఆధునీకరించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఒడిశాలోని ఖుర్దా జంక్షన్‌ను ఇప్పటికే ఈ విధంగా అభివృద్ధి చేశారు. దీంతో వెయ్యి రైల్వే స్టేషన్లను ఇదే విధంగా అభివృద్ధి చేయాలని, కొత్త పథకం కింద, ప్రతి స్టేషన్‌లో 10 నుండి 20 కోట్ల రూపాయలను మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయాలని నిర్ణయించిది భారతీయ రైల్వే. ఏదాడి లేదా ఏడాదిన్నరలో ఈ పని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ముందస్తు ప్రణాళిక ప్రకారం 68 డివిజన్ల పరిధిలో రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 200 ప్రధాన స్టేషన్లను ఆధునీకరణ ప్రణాళికకు అదనంగా ఈ ప్రణాళికను భారతీయ రైల్వే రూపొందించింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడం, సౌకర్యాలను దశలవారీగా మెరుగుపర్చడం ఈ ప్రణాళిక లక్ష్యం. చిన్న రైల్వే స్టేషన్లలో కూడా హై లెవల్ ప్లాట్ ఫారమ్‌లు, మంచి కెఫెటేరియా సౌకర్యంతో పాటు.. వెయిటింగ్‌ రూమ్‌ల సౌకర్యాన్ని మెరుగుపర్చడం వంటి పనులు చేయనున్నారు. రైల్వే స్టేషన్‌ బయట ప్రణాళికబద్ధమైన పార్కింట్, లైటింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చడం, రైళ్ల రాకపోకలను తెలియజేసేలా డిజిటల్‌ బోర్డులు, దివ్యాంగుల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రయోజనాలు ఇవే..

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా చిన్న రైల్వేస్టేషన్లు అభివృద్ధి చెందడంతో పాటు.. మరిన్ని అదనపు ప్రయోజనాలు ప్రయాణీకులకు లభించనున్నాయి.

ఇవి కూడా చదవండి

డివిజనల్ రైల్వే మేనేజర్లతో ప్రత్యేక నిధినిఏర్పాటు చేస్తారు.

ఈ పథకం కింద స్టేషన్లలో రూఫ్ ప్లాజా, సిటీ సెంటర్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఖుర్దా స్టేషన్‌ను రూ.4 కోట్లతో ప్రయాణికుల అవసరమైన సౌకర్యాలతో ఆధునీకరించారు.

ఈ స్టేషన్ ముందు భాగం పునర్‌నిర్మించడంతో పాటు రైల్వే ట్రాక్‌ల సంఖ్యను పెంచారు.

రైల్వే స్టేషన్‌లోని ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..