Credit Card Tips: క్రెడిట్ కార్డ్‌ నుంచి డబ్బు డ్రా చేయడం లేదా కార్డుపై రుణం తీసుకోవడం.. రెండింటిలో ఏది బెస్ట్..

క్రెడిట్ కార్డ్‌లు చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. క్రెడిట్ కొనుగోళ్లు, ఏటీఎం నగదు ఉపసంహరణల నుంచి వ్యక్తిగత రుణాలను పొందడం వరకు క్రెడిట్ కార్డును ఉపయోగపడుతుంది. కానీ ఒక సమస్య ఉంది. ఇదంతా ఖర్చుతో వచ్చే సమస్య. మీ వైపుగా ఏదైనా లోపం ఏర్పడితే అది రుణం వరకు వెళ్లిపోతుంది. అది కాస్తా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలో తెలుసుకోండి..

Credit Card Tips: క్రెడిట్ కార్డ్‌ నుంచి డబ్బు డ్రా చేయడం లేదా కార్డుపై రుణం తీసుకోవడం.. రెండింటిలో ఏది బెస్ట్..
Credit Card
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 26, 2022 | 12:57 PM

క్రెడిట్ కార్డులు మన జీవితాలను చాలా స్మార్ట్‌గా మార్చేశాయి. ఆర్దిక సమస్య అనేది రాకుండా.. ఆలోటును తీర్చేస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎక్కడంటే అక్కడ ఈ కార్డును ఉపయోగించవచ్చు. వారు క్రెడిట్ కొనుగోళ్లు చేయడం, ఏటీఎంల (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు) నుంచి నగదు ఉపసంహరించుకోవడం మొదలు వ్యక్తిగత రుణాలను పొందడం వరకు బహుళ అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి. కానీ ఇదంతా రాను రాను ఖర్చుగా మారుతుంది. దీన్ని సక్రమంగా వినియోగించినంత కాలం చాలా బాగుంటుంది. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మీ పక్షంలో ఏదైనా పొరపాటు జరిగితే అది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. అది పెద్ద గుదిబండగా మారుతుంది. ఇది అత్యంత దారుణమైన దృష్టాంతంలో రుణం వరకు వెళ్లిపోతుంది. ఇందులో ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌లపై నగదు ఉపసంహరణలనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. వాటి ప్రయోజనాలు,అప్రయోజనాలు కొన్నింటిని తెలుసుకుందాం.

నగదు ఉపసంహరణ:

డబ్బు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండే అన్ని మార్గాలను వెతుకుతుంటాం. ఇలాంటి సమయంలో చాలా మంది తమ వద్ద ఉన్న క్రెడిట్ కార్డ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే వాటికి తక్షణ నగదు అవసరం లేదు. చాలా మంది పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు తమ క్రెడిట్ కార్డ్ నుంచి రుణం తీసుకుంటారు. ఇది ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా రుణాన్ని అందిస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే నగదు ఉపసంహరణ కోసం ఏటీఎం సెంటర్‌కు వెళతారు.

క్రెడిట్ స్కోర్:

క్రెడిట్ కంపెనీలు మంచి కస్టమర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్, మీరు కార్డ్‌ని ఉపయోగించే విధానం ఆధారంగా కంపెనీలు ఈ లోన్‌లను ముందస్తుగా ఆమోదించాయి. వారు ఈ లోన్ ఆఫర్ల గురించి కస్టమర్లకు తెలియజేస్తారు. అవసరమైతే, మీరు ఒక్క క్లిక్‌లో రుణం పొందుతారు. రుణ గ్రహిత నుంచి ఎటువంటి హామీ తీసుకోకుండానే లోన్ అందిస్తాయి. నిర్ణీత వడ్డీతో నిర్ణీత కాలానికి లోన్ ఇస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే వ్యక్తిగత రుణాలతో పోలిస్తే, క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

క్రెడిట్ పరిమితిని ప్రభావితం చేస్తుంది:

కొందరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే ముందు ముఖ్యమైన పాయింట్‌లను చెక్ చేయరు. క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకోవడం.. రుణం తీసుకోవడం.. ఈ రెండు వేరు వేరు అంశాలు. నగదు ఉపసంహరణలు మీ క్రెడిట్ పరిమితిని ప్రభావితం చేస్తుంది. అదనంగా, క్రెడిట్ కార్డ్ ఉపసంహరణలపై 36-48 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. మిగిలిన మొత్తం చివరి చెల్లింపు రోజులోపు చెల్లించాలి.

వ్యక్తిగత రుణాలు:

క్రెడిట్ కార్డ్ రుణాలు 36 నెలల వరకు EMI (సమాన నెలవారీ వాయిదాలు) చెల్లింపులను అందిస్తాయి. వడ్డీ రేటు 16-18 శాతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే దీనికి కార్డ్ పరిమితితో సంబంధం లేదు. క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు మీరు సమర్పించే పత్రాలు, ఇతర రుజువుల ఆధారంగా కార్డ్‌పై పర్సనల్ లోన్ ఇవ్వబడుతుంది. అందువల్ల, అదనపు పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. కాబట్టి, సులభంగా రుణం పొందేందుకు ఇది ఒక మార్గం అని చెప్పవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం