Auto Expo 2023 : ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూసుకుపోతున్న కియా! మార్కెట్లోకి మరో ఎస్ యూవీ! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాస్టింగ్!

ఇప్పటికే హ్యూందాయ్ సంస్థ తన అత్యాధునిక ఐయానిక్ 7 ని వచ్చే కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. దానికి పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా (Kia) కొత్తగా మరో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

Auto Expo 2023 : ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దూసుకుపోతున్న కియా! మార్కెట్లోకి మరో ఎస్ యూవీ! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాస్టింగ్!
Kia EV9
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2022 | 5:22 PM

ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఒకదాని కొకటి పోటాపోటీగా తమ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే హ్యూందాయ్ సంస్థ తన అత్యాధునిక ఐయానిక్ 7 ని వచ్చే కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించగా.. దానికి పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా (Kia) కొత్తగా మరో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈమేరకు ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి సంబంధించిన టీజర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వచ్చే నెల నోయిడాలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో కియా ఈవీ9 కాన్సెప్ట్ ను ఆ సంస్థ ప్రదర్శించే అవకాశం ఉంది. మూడు వరుసల సీటింగ్‍తో కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు వస్తుంది. ఈ ఎస్‍యూవీ ప్రొడక్షన్ 2023లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‍లో ఈవీ9 ఫ్లాగ్‍షిప్ మోడల్‍ను అందుబాటులోకి తెచ్చింది కియా. కాగా, ఈ ఆటో ఎక్స్‌పోలో కార్నివల్.. కొత్త (New Kia Carnival) మోడల్‍ను కూడా కియా తీసుకురానుంది. కియా సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్ ఎడిషన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఫీచర్లు అదరహో..

కియా ఈవీ9 లోని అన్ని ఫీచర్లు ఇంకా బహిర్గతం కాకపోయినప్పటికీ టీజర్ లో ద్వారా పరిచయం అయిన కొన్ని ఫీచర్లు కొనుగోలు దారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇన్ బిల్ట్ గా వస్తున్న పానోరామిక్ సొలార్ ప్యానెల్ ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. దానితోపాటు 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది పొడవు 5 మీటర్లు కాగా.. వెడల్పు దాదాపు రెండు మీటర్లు ఎత్తు 1.7 మీటర్లు ఉంటుంది. అలాగే 2900 మిల్లీమీటర్ల పొడవుండే వీల్ బేస్ ఈ కారు కలిగి ఉంది. అలాగే 27 ఇంచ్ అల్ట్రా వైడ్ డిస్‍ప్లే‍తో ఈ ఎలక్ట్రిక్ కియా ఈవీ9తో రానుంది.

మైలేజీ ఎంతంటే..

ఈ కియా ఈవీ9 టాప్ ఫుల్ గ్లాస్ రూఫ్ తో వస్తోంది. ఇది ఈజీఎంపీ( ఎలక్ట్రిక్ గ్లోబల్, మాడ్యూలర్ ప్లాట్ ఫామ్) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 100 kWh బ్యాటరీ ప్యాక్ తో రానుంది. ఒక సారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిలో 2WD , 4WD రెండు ఆప్షన్లు ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..