Ch Murali

Ch Murali

Special Correspondent - TV9 Telugu

murali.chennuri@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.. ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది.. 2002 నుంచి ఈటీవీ, 2004 నుంచి ఈటీవీ 2 లో , 2006 నుంచి జీ తెలుగు, 2009 లో మహా న్యూస్, 2012 నుంచి టివి9 లో అడుగుపెట్టాను.. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Follow On:
Andhra Pradesh: తేనె కోసం వెళితే బంగారు నాణేల బిందె దొరికింది.. కట్ చేస్తే పంపకాల్లో కథ అడ్డం తిరిగింది..?

Andhra Pradesh: తేనె కోసం వెళితే బంగారు నాణేల బిందె దొరికింది.. కట్ చేస్తే పంపకాల్లో కథ అడ్డం తిరిగింది..?

Nellore : అయితే దొరికిన బంగారు నాణేలు ఏ శతాబ్ధానికి చెందినవో తెలియదు. కానీ, వాటిపై తాజ్ మహల్ పదాలు వచ్చేలా ఉర్దూ లో ఉన్నాయని చెప్పారు. యువకులకు బంగారు నాణేలు దొరికాయి. కానీ, వాటాల్లో తేడాతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు జిల్లా లో ఎక్కడ ఏ ఇద్దరు చేరినా ఈ బంగారు నాణేల చెంబు గురించే మాట్లాడుకుంటున్నారు.

Tirupati: తిరుమల కొండల్లో ఎన్ని చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయో తెలుసా.. అటవీశాఖ లెక్కల వివరాలివే..

Tirupati: తిరుమల కొండల్లో ఎన్ని చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయో తెలుసా.. అటవీశాఖ లెక్కల వివరాలివే..

Tirupati: శేషాచలం కొండల్లోనే తిరుమల శ్రీవారి ఆలయం ఉంది. ఏడుకొండలుగా పిలువబడే గరుడాద్రి, శేషాద్రి, వృషబాద్రి, నీలాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి కొండలు శేషాచలం అడవుల్లో భాగమే.. ఈ సప్తగిరులపైనే శ్రీవారు కొలువై ఉన్నారు. ప్రపంచంలోనే అరుదైన జీవజంతుజాలంతో పాటు, అరుదైన వృక్ష సంపద ఈ శేషాచల కొండల ప్రత్యేక. ఇవే కాక ప్రమాదకరమైన వన్యమృగాలకు కూడా శేషాచలం కొండలు ఆవాసంగా ఉన్నాయి. ఈ కొండల్లో చిరుతలు, ఎలుగుబంట్లు కూడా ఉన్న సంగతి..

Tirumala: అదిగో పులి.. ఇదిగో ఎలుగుబంటి.. శ్రీవారి భక్తులకు మరో భయం.. టీటీడీ అధికారులకు మప్పుతిప్పలు..

Tirumala: అదిగో పులి.. ఇదిగో ఎలుగుబంటి.. శ్రీవారి భక్తులకు మరో భయం.. టీటీడీ అధికారులకు మప్పుతిప్పలు..

Tirumala News: టీటీడీ సిబ్బంది.. ఫారెస్ట్‌ అధికారుల ఎఫర్ట్స్‌ కొంత వరకు ఫలితాలను ఇస్తున్నా.. రోజుకో వణ్యప్రాణి బోర్డుకు ఛాలెంజ్ ఎదురవుతోంది. తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోన్లకు చిరుత చిక్కింది. అయితే ఒక చిరుత కాదు... నడక మార్గంలో మరో 3 చిరుతలు ఉన్నాయి.. తిరుమలలో వన్యమృగాల సంచారంతో టీటీడీ అలర్ట్‌ అయింది. తాజాగా ఓ ఎలుగుబంటి కనిపించడంతో మరింత ఆందోళన మొదలైంది. దీంతో ఆపరేషన్ బంటిని మొదలు పెట్టింది.

ఇన్‌స్టా రీల్స్ కోసమని కొండ చివరకు వెళ్తే.. రెండు కాళ్లు విరిగి నరకయాతన!

ఇన్‌స్టా రీల్స్ కోసమని కొండ చివరకు వెళ్తే.. రెండు కాళ్లు విరిగి నరకయాతన!

తమిళనాడు రాష్ట్రం లోని కృష్ణగిరి జిల్లాలోని కొండ ప్రాంతంలో సుబ్రమణ్యం స్వామి (మురుగన్ కోయిల్) ఆలయం ఉంది. ఎత్తైన కొండ ప్రాంతంలో ఆలయం సమీపంలో నిటారుగా బండరాళ్లు ఉంటాయి. అమిత్ కుమార్ అనే యువకుడు ఆ బండరాళ్లపై నిల్చుని వీడియో రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా అదుపు తప్పింది.. వంద అడుగుల బండపై నుంచి జారుకుంటూ దిగువనున్న రెండు బండరాళ్ల మధ్య పడిపోయాడు. పడగానే రెండు కాళ్ళు విరిగిపోయాయి. రాళ్ళ మధ్యే ఇరుక్కుపోయాడు..

Aditya L1 Mission: రోడ్డు మార్గం ద్వారా శ్రీహరికోటకు చేరిన ఇస్రో-ఆదిత్య శాటిలైట్.. ప్రయోగం ఎప్పుడంటే..!

Aditya L1 Mission: రోడ్డు మార్గం ద్వారా శ్రీహరికోటకు చేరిన ఇస్రో-ఆదిత్య శాటిలైట్.. ప్రయోగం ఎప్పుడంటే..!

ఇది సూర్యుని పై ప్రయోగం కోసం ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం. ఇప్పటిదాకా చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలు చేసిన ఇస్రో ప్రపంచ దేశాలు గర్వించే రహస్యాలను బయటపెట్టింది. గతంలో చంద్రుడిపై, అంగారకుడిపై నాసా, రష్యా, చైనా లాంటి దేశాలు అనేక ప్రయోగాలు చేపట్టినా అప్పటి వరకు ప్రపంచానికి తెలియని రహస్యాలను తెలిసేలా చేసింది. అదేవిధంగా సూర్యుడిపై కూడా అనేక దేశాలు ప్రయోగాలు చేపట్టాయి.. కానీ కొత్త విషయాలను కనిపెట్టడమే ఉద్దేశ్యంగా ఇస్రో ఈ ప్రయోగం..

క్లైమాక్స్‌ దశకు చేరిన భారత ‘గగన్ యాన్’ ప్రిపరేషన్.. ఇస్రో చేపట్టిన పారాచ్యూట్ టెస్ట్ విజయవంతం..

క్లైమాక్స్‌ దశకు చేరిన భారత ‘గగన్ యాన్’ ప్రిపరేషన్.. ఇస్రో చేపట్టిన పారాచ్యూట్ టెస్ట్ విజయవంతం..

ISRO: రెండేళ్ల ఆలస్యంగా 2024 లో ప్రయోగం జరగనుంది.. ఇందు కోసం ఇస్రో ముందస్తు ప్రక్రియను వేగవంతం చేసింది.. ఈ ప్రయోగం కోసం ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళతారు.. నిర్దేశిత కక్ష్యలో మూడు రోజుల పాటు ప్రయోగం అనంతరం తిరిగి భూమి మీదకు వస్తారు.. అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆ ముగ్గురు వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కూడా పూర్తి కావొచ్చింది.. సాధారణంగా ఉపగ్రహాలను నింగిలోకి పంపే ప్రక్రియతో పోల్చితే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనది. వ్యోమనౌకను భూమిపై నుంచి కక్ష్యలోకి పంపడం..

Andhra Pradesh: నెల్లూరొచ్చిన నోరూరించే పులస చేపల కూర.. ఎగబడ్డ జనాలు

Andhra Pradesh: నెల్లూరొచ్చిన నోరూరించే పులస చేపల కూర.. ఎగబడ్డ జనాలు

పుస్తెలమ్మయినా సరే పులస చేప తినాలి అనేది గోదావరి జిల్లాల్లో నానుడి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ తినేవారి కోరిక.. చచ్చేలోపు ఒక్కసారైనా పులస తినాలి అని. ఈ మాట చాలామంది నోటి విన్నదే. సీజన్ వారిగా గోదావరికి ఎదురు ఈది వలలో పడే పులసకు మాములు డిమాండ్ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పులస పరిమితం. అయితే గోదావరిలో దొరికే పులసకు ఏపీలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్న డిమాండ్ అలాంటిది. తిరుపతి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరుమల లడ్డూ తీసుకెళ్లి ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుంటారు.

తవ్వకాల్లో బయటపడ్డ భోషాణం.. తెరిచి చూశాక షాక్ అయిన అధికారులు.. ఇంతకీ అందులో ఏముందంటే..?

తవ్వకాల్లో బయటపడ్డ భోషాణం.. తెరిచి చూశాక షాక్ అయిన అధికారులు.. ఇంతకీ అందులో ఏముందంటే..?

ఓ పాత మసీదు భవనాన్ని తొలగించే క్రమంలో ఇలాగే ఓ భోషాణం బయటపడింది.. భోషాణం అంటే ఇప్పటి వారికి చాలామందికి తెలియక పోవచ్చు.. కానీ పాత కాలంలో బీరువాల స్థానంలో ఉండే బరువైన ఇనుప పెట్టెలు ఇవి. ఇక వీటిని ఇంటి ఫ్లోర్‌కి కలిపి బిగించేవారు.. వాటిని ఎత్తుకెళ్లడం కూడా ఎవరికీ సాధ్యం కాదు.. పైగా ఇవి గతంలో తక్కువ మంది ఇళ్లలో మాత్రమే ఉండేవి.. నేరుగా వీటిని చూసినవారు కూడా చాలా తక్కువ.. పాత సినిమాల్లో జమిందార్ క్యారెక్టర్ ఒక ఇనుప పెట్టెను తెరిచి అందులో నుంచి డబ్బు తీసే దృశ్యాల్లో చాలామంది చూసే ఉంటారు.. ఆ ఇనుప పెట్టె..

Nellore Chepala Pulusu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి

Nellore Chepala Pulusu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి

మనం ఎప్పుడు బయట ప్రాంతాలకు వెళ్లినా.. అక్కడ దొరికే స్పెషల్ తో పాటు మన స్టైల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో ముందుగా వెతుక్కుంటాం. అందులోనూ నెల్లూరు చేపల పులుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెల్లూరు తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలవారికి తెగ నచ్చే వెరైటీ చేపల పులుసు.. ఇక బయట రాష్ట్రాల వారికి కూడా ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు ఫెవరేట్ గా మారింది. అయితే ప్రతిసారి నెల్లూరు వెళ్లి చేపల పులుసు తినలేం.. అలా అని ఆ పేరుతో రెస్టారెంట్ లో అందుబాటులో ఉన్నా అన్ని సందర్భాల్లో కుదరదు. అందుకే మనమే ఇంట్లో నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఇలా తయారు చేసుకోవచ్చు.

Bike Racer: 13 ఏళ్ల వయసులోనే రేసింగ్‌లో ఎన్నో టైటిల్స్ సాధించాడు.. చివరికి ఊహించని ప్రమాదం

Bike Racer: 13 ఏళ్ల వయసులోనే రేసింగ్‌లో ఎన్నో టైటిల్స్ సాధించాడు.. చివరికి ఊహించని ప్రమాదం

స్పెయిన్, ఫ్రాన్స్, క్వీన్స్లాండ్ లో జరిగిన రేసుల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ రేసుల్లో గెలుపొందాడు శ్రేయాస్. కానీ సొంత దేశంలో జరిగిన రేసింగ్‎లో ఊహించని ప్రమాదం జరిగింది. రెండు రోజుల క్రితం చెన్నై శివారు శ్రీపెరంబదూరు వద్దనున్న ఎం.ఆర్.ఎఫ్ ట్రాక్‎పై రేసింగ్ జరిగింది. ఈ ఇండియన్ నేషనల్ రేసింగ్ లో దాదాపు 18 మంది రేసర్లు పాల్గొన్నారు.

ఆ మహిళలకు ఆలయంలోకి ప్రవేశం నిషేధం.. మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. ఎక్కడ.. ఎందుకంటే..

ఆ మహిళలకు ఆలయంలోకి ప్రవేశం నిషేధం.. మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. ఎక్కడ.. ఎందుకంటే..

Madras High Court: సామాన్యులు పోలీసులకు పిర్యాదు చేస్తే ఏమవుతుందో.. అక్కడా అదే జరిగింది.. ఇక ఇక్కడ న్యాయం జరగదని భావించిన తంగమణి ఆలయంలో జరుగుతున్న అనాచారంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.. పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ జరిపింది.. జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి స్మార్ట్ యుగంలోనూ ఇంకా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు ఆతర్వాత నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు.. ఎవరైతే వితంతు మహిళను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారో..

Actor Vijay: దళపతి విజయ్‎పై బీజేపీ ఆశలు.. సడన్ పొలిటికల్ ఎంట్రీ నిర్ణయం వెనుక కారణం అదేనా ?

Actor Vijay: దళపతి విజయ్‎పై బీజేపీ ఆశలు.. సడన్ పొలిటికల్ ఎంట్రీ నిర్ణయం వెనుక కారణం అదేనా ?

తమిళనాడు రాజకీయాల్లోకి ఇప్పటిదాకా ఎంతో మంది నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. అందులో సక్సెస్ అయ్యింది మాత్రం చాలా తక్కువ. సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు.. కరుణానిధి, ఎం.జి రామచంద్రన్, జయలలిత, టి.రాజేందర్, రాధా రవి, కారుణాస్, గౌతమి, సీమాన్, శరత్ కుమార్, కుష్బూ, విజయ్ కాంత్, కమల్ హాసన్, తాజాగా ఉదయనిది స్టాలిన్. ఉదయనిది స్టాలిన్ సినీ నటుడు మాత్రమే కాదు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడు.