ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విప్లవాత్మక విద్యా విధానాలను న్యూయార్క్ లో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న హైలెవల్ పొలిటికల్ ఫోరంలో తెలియజేయాలని, అందుకు తమ రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని పంపించాలని ఆహ్వానించింది ఐక్యరాజ్యసమితి. రాష్ట్ర విద్యావ్యవస్థలో జరుగుతున్న మార్పులు, తీసుకున్న నిర్ణయాలపై ప్రజా చైతన్య యువజన సంఘం ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఐక్యరాజ్యసమితికి ఓ నివేదిక ఇచ్చింది. అందుకు స్పందించిన ఐక్యరాజ్యసమితి ఆ విధానాలను అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆహ్వానాన్ని పంపింది.