Inspiring story: అంతరించిపోతున్న కళకు జీవం పోస్తోన్న యువకుడు.. బాలికలకు కత్తి, కర్రసాముల్లో శిక్షణ

అంతరించిపోతున్న ఈ విద్యను ప్రభుత్వం కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉద్యోగాల నుంచి ఇంటికి వెళుతున్న మహిళలకు కానీ బస్సులలో ప్రయాణించే విద్యార్థినిలకు కానీ, ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్లి వస్తున్న మహిళలకు ఈ కర్ర సాము విద్య చాలా ఉపయోగం

Inspiring story: అంతరించిపోతున్న కళకు జీవం పోస్తోన్న యువకుడు.. బాలికలకు కత్తి, కర్రసాముల్లో శిక్షణ
Karra Samu In Kadapa
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2022 | 8:59 PM

కర్రపట్టుకుని గిరగిరా తిరుగుతుంటే ఆస్టైలే వేరు .. ఒకప్పుడు రాజుల కాలంలో ఇది యుద్ద విద్యలలో ఒకటి .. కత్తి సాముతో పాటు కర్రసాము కూడా చాలా ముఖ్యమైన విద్య .. కత్తి విద్యలో కత్తిని ఏ విధముగా గిరగిరా తిప్పుతామో కర్ర సాములో కూడా కర్రను అంతకుమించిన స్పీడుతో ఊపుతో తిప్పవచ్చు. కర్ర సాము చేస్తుంటే చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా ఆ మనిషి దరి చేరాలంటే అది పద్మవ్యూహం లోనికి వెళ్ళినట్టే. దెబ్బ ఎక్కడ పడిందో తెలీదు ఎక్కడ బోనికలు ఇరుగుతాయో తెలియదు.

ప్రాచీన కళలలో కర్ర సాము ఒకటి పూర్వం గ్రామీణ ప్రాంతాలలో కర్రసామును ఆచారంగా నిర్వహించేవారు. కాలానుగుణంగా ఈ కళపై ఆసక్తి సన్నగిల్లుతోంది… అంతరించిపోతున్న ఈ కళను భావితరాలకు అందించేందుకు కడపకు చెందిన యువకుడు నడుం బిగించాడు. ఆత్మ రక్షణ కోసం ఎంతో ఉపయోగపడే ఈ కర్ర సాము విద్యపై శిక్షణ ఇస్తున్నాడు. కడపకు చెందిన జయచంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. తండ్రి సహకారంతో కర్ర సాములో ప్రావీణ్యం సంపాదించాడు. తనకున్న విద్యను పలువురికి నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. గత కొన్నేళ్లుగా విద్యార్థినిలకు ఈ కర్ర సాములు శిక్షణ ఇస్తున్నాడు . చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కర్ర సాము నేర్చుకోవాలనే ద్యేయంగా తాను శిక్షణ ఇస్తున్నానని అంటున్నాడు జయచంద్ర. ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగకరమైన ఈ కళ పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ముఖ్యంగా విద్యార్థినులు, ఆడవారు ఈ కలను నేర్చుకుంటే తమకు తాము ఆకతాయిల నుంచి కానీ , కొన్ని సంఘటన నుంచి కానీ రక్షించుకోవచ్చు అని అంటున్నాడు. చేతిలో కర్ర పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఎంతటి వారినైనా తృణప్రాయంగా ఎదుర్కోవచ్చునని ఈ యువకుడు అంటున్నాడు. కర్ర సాముకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని, కర్రసాము శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం స్థలం ఇవ్వాలని జయచంద్ర కోరుతున్నాడు.

ప్రతి విద్యార్థినులు ఈ కర్ర సాము పట్ల ఎంతో దృష్టి సారించారు. ప్రతి విద్యార్థికి ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ విద్యా చాలా అవసరమని ప్రస్తుత పరిస్థితులలో ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సమాధానం చెప్పాలంటే ఇటువంటి ప్రాచీన విద్య ఎంతో అవసరమని వారు అంటున్నారు. తమను తాము రక్షించుకోవడంతోపాటు శారీరకంగా కూడా దృఢంగా ఉండవచ్చని, ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. కర్ర సాము ప్రాచీన విద్య అయినప్పటికీ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న కరాటే ,కుంఫు, బాక్సింగ్ వంటి శారీరక విద్యలకు ధీటుగా ఉంటుందని ప్రస్తుత పరిస్థితులలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కర్ర సాము నేర్చుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అంతరించిపోతున్న ఈ విద్యను ప్రభుత్వం కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉద్యోగాల నుంచి ఇంటికి వెళుతున్న మహిళలకు కానీ బస్సులలో ప్రయాణించే విద్యార్థినిలకు కానీ, ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్లి వస్తున్న మహిళలకు ఈ కర్ర సాము విద్య చాలా ఉపయోగం. ఇది ఒక్క కడప నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలని ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలన్నారు .. రానున్న కాలంలో ప్రతి మహిళకు ఆత్మరక్షణగా ఈ కర్ర సాము ఉపయోగపడుతుందని విద్యార్థినిలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

అమ్మాయిలను ఏడిపించే వారిపై ప్రతి కారం తీర్చుకోవడానికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని .. ర్యాగింగ్ చేసే సమయంలో ఏడిపించే వారిని కొట్టాలనిపించిన ఏమి చేయలేమని అదే కర్రసాము లాంటి విద్య నేర్చుకుని ఉంటే వారిని ప్రతిఘటించేదానికి అవకాశం ఉంటుందని విద్యార్థినిలు అంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలలో భయం పోవాలి అంటే కర్ర సాము అనే విద్య ఎంతో ఉపయోగపడుతుందని ఇది ప్రాచీన విద్య అయినప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన విద్య కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సినిమాలలో చూస్తున్న కొన్ని సన్నివేశాలు, నిత్యజీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు అనేకమంది విద్యార్థినిలకు ఇక్కడ వారు కర్ర సాము చేసే దానికి దోహదం చేశాయి. తమ నుండి తామును కాపాడుకుంటూనే మరి కొంతమంది తమ స్నేహితుల కోసం కూడా పోరాడడానికి శక్తి కూడగట్టుకుని పోరాడ వచ్చని ఇక్కడ విద్యార్థినిలు అంటున్నారు.

ఈ మధ్యకాలంలో కడపలోని దిశ పోలీసులకు కూడా ఈ విద్యను నేర్పినట్టు జయచంద్ర అంటున్నాడు. మహిళా పోలీసులకు ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా వారు కూడా శారీరక దృఢత్వంతో పాటు కొన్ని కొన్ని సమయాలలో ఆత్మరక్షణ కూడా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ కర్ర సాము ఉపయోగపడుతుందని అంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యనే కాకుండా కర్రసాము లాంటి ప్రాచీన విద్యను కూడా ప్రోత్సహిస్తే రానున్న కాలంలో దిశాలాంటి కేసులు కొన్నైనా రూపుమాపగలం..

కర్రసాము శిక్షణకు సంభందించిన అన్ని అనుమతులు ప్రభుత్వం నుంచి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని . అఫిలియేషన్ సర్టిఫికెట్ ఉంటే రానున్న కాలంలో స్టేట్ లెవెల్ , నేషనల్ లెవెల్ లో కూడా పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ పొందే అవకాశం ఉంటుందని శాప్ డైరెక్టర్ డానియేల్ ప్రదీప్ అన్నారు .. ప్రభుత్వానికి ఇప్పటికే దీనికి సంభందించిన అన్ని వినతులు పంపించామని వచ్చే ఏడాదిలోపు కర్రసాముకు అఫిలియేషన్ వచ్చే విధంగా కృషిచేస్తామన్నారు .. కడప నగరానికే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఈ ప్రాచీన విద్యను ప్రోత్సహించాలని ముఖ్యంగా ఆడపిల్లలు ఈ కళ పట్ల ఆసక్తి చూపాలని డానియేల్ ప్రదీప్ అన్నారు.

Reporter: Sudhir , Tv9 Telugu

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..