Anantapur: ప్రకృతి పులకరించింది… పరవశించి సయ్యాట ఆడిన జంట పాములు..

పామును చూస్తే మనుషులు వాటికి దూరంగా వెళ్ళటం...పాములు మనుషులని చూసినా... చిన్న అలికిడి అయినా వేగంగా వెళ్ళిపోవటం మనం చూస్తూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే పాముని చూస్తే మనిషికి భయం.. మనుషులను చూస్తే.. పాములు తప్పుకుని వెళ్తాయి. కానీ సర్పాలు సయ్యాట సమయంలో మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచం మరిచిపోయి సయ్యాట ఆడటం తరచూ అక్కకడక్కడా చూస్తూనే ఉంటాం..

Anantapur: ప్రకృతి పులకరించింది... పరవశించి సయ్యాట ఆడిన జంట పాములు..
Two Snkes Dance
Follow us
Nalluri Naresh

| Edited By: Surya Kala

Updated on: Aug 01, 2023 | 11:36 AM

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. కొన్ని వ్యక్తి ప్రతిభతో ఆకట్టుకుంటే, మరికొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తుంటాయి, ఇంకొన్ని షాక్ ఇచ్చేవిగా ఉంటాయి. గత కొంతకాలంగా పాములకు సంబంధించిన వీడియాలు నెట్టింట్లో భారీగా హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పాముల ఫైటింగ్, పాముల సయ్యాటకు సంబంధించిన వీడియాలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రెండు పాములు ఒకటిదానితో ఒకటి పెనవేసుకుని తన్మయత్వంతో సయ్యాటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే  సాధారణంగా పాములంటే అందరికీ భయమే. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతాం. ఒక వేళ పాము కనిపిస్తే.. ఆ దరి దాపుల్లోకి వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. ఐతే అదే పాములు సయ్యాట ఆడుతుంటే మాత్రం చూడటానికి అందరూ పోటీ పడతారు..

పామును చూస్తే మనుషులు వాటికి దూరంగా వెళ్ళటం…పాములు మనుషులని చూసినా… చిన్న అలికిడి అయినా వేగంగా వెళ్ళిపోవటం మనం చూస్తూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే పాముని చూస్తే మనిషికి భయం.. మనుషులను చూస్తే.. పాములు తప్పుకుని వెళ్తాయి. కానీ సర్పాలు సయ్యాట సమయంలో మాత్రం చుట్టూ ఉన్న ప్రపంచం మరిచిపోయి సయ్యాట ఆడటం తరచూ అక్కకడక్కడా చూస్తూనే ఉంటాం..అలాంటి ఘటనే అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

సుప్రసిద్ధ ధార్మిక మఠం గవిమఠం సమీపంలో ప్రాంగణంలోని గోశాల వద్ద రెండు పాములు గంటపాటు సయ్యాట ఆడాయి. ఒకదానికొకటి మెలి వేసుకుని.. పెన వేసుకుని సయ్యాటలాడాయి. అందరూ చూస్తున్న విషయం పట్టించుకోకుండా తమ ప్రపంచంలో తన్మయత్వంలో మునిగి పోయాయి. పాముల సయ్యాట వీడియోలను కొందరు తమ ఫోన్ లలో చిత్రీకరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..