Visakhapatnam: వీడిన మిస్టరీ..! ఏలేరు కాలువలో పైకి తేలిన దంపతుల మృతదేహాలు..

మేమిద్దరం వెళ్లిపొతున్నాం.. పిల్లలు జాగ్రత్త.. వారిని మంచిగా చూసుకోండి.. అంటూ దంపతులు రోదిస్తున్న వీడియో విశాఖపట్నంలో కలకలం రేపింది. ఆర్ధిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని.. వరప్రసాద్ దంపతులు అదృశ్యమయ్యారు.

Visakhapatnam: వీడిన మిస్టరీ..! ఏలేరు కాలువలో పైకి తేలిన దంపతుల మృతదేహాలు..
Vizag News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2023 | 1:46 PM

విశాఖలో వరప్రసాద్ దంపతుల అదృశ్యం మిస్టరీ వీడింది. కొప్పాక ఏలేరు కాలువలో వరప్రసాద్‌ దంపతుల డెడ్‌బాడీలు దొరికాయి.. రాజుపేట రైల్వే క్రాస్ దగ్గర ఏలేరు కాలువలో జంట మృతదేహాలను చూసి పోలీసులు వరప్రసాద్ పిల్లలకు సమాచారం ఇచ్చారు. అయితే, మృతదేహాలను చూసి వరప్రసాద్ కొడుకు శివ సాయి తేజ బోరున విలపించాడు. మృతదేహాలు తమ తల్లిదండ్రులవేనని తెలిపాడు. కొప్పాక ఏలేరు కాలవలో దూకి వరప్రసాద్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. సెల్ఫీ వీడియో అనంతరం అదృశ్యమైన దంపతుల బైక్ కనిపించిన రెండు కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు లభ్యమయ్యాయి.  కాలువ మధ్య ఉన్న చెత్తలో రెండు మృతదేహాలు కూరుకుపోయాయి. పోలీసులు మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.

మేమిద్దరం వెళ్లిపొతున్నాం.. పిల్లలు జాగ్రత్త.. వారిని మంచిగా చూసుకోండి.. అంటూ దంపతులు రోదిస్తున్న వీడియో విశాఖపట్నంలో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్‌ సెల్ఫీ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు వరప్రసాద్‌, మీరా..ఆ తర్వాత వరప్రసాద్‌ బైక్‌, చెప్పులు, హ్యాండ్‌ బ్యాగ్‌, మొబైల్‌ కొప్పాక ఏలేరు కాలువ వద్ద లభించాయి.. దీంతో ఆ కాలువలో దూకి ఆత్మహత్మ చేసుకున్నారా అని పోలీసులు నిన్నటి నుంచి గజ ఈతగాళ్లతో ఆ కాలువలో గాలించారు. ఇవాళ అదే కాలువలో రెండు డెడ్‌బాడీలు లభించాయి..బైక్‌ లభించిన చోట 2కిలోమీటర్ల దూరంలో లభ్యం అయ్యాయి..

దీంతో వరప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..