Andhra Pradesh: రాష్ట్రపతి పర్యటన వేళ.. మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌కు అరుదైన గౌరవం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. నేవీడే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. సాధారణంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వ్యక్తులు ఏదైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. నేవీడే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. సాధారణంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వ్యక్తులు ఏదైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా గవర్నర్, ముఖ్యమంత్రి వారికి స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి ఏ పార్టీకి చెందిన వారైనా.. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి స్వాగతం పలికే విషయంలో కొన్ని సంప్రాదాయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఏదైనా ప్రత్యేక సందర్భంలో ముఖ్యమంత్రికి వీలుకానప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి వర్గంలో ఒకరు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అయితే ఈనెల 4వ తేదీన విశాఖపట్టణంలో నేవీ డే వేడుకలకు హాజరవడానికంటే ముందు ఆమె ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ చేరుకుంటారు. దీంతో విజయవాడలోనే సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ఈ నేపథ్యంలో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రపతి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విశాఖపట్టణంలోని విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికే దగ్గరనుంచి, విశాఖ నుంచి ఆమె తిరిగి వెళ్లేంతవరకు ముఖ్యమంత్రి స్థానంలో ప్రభుత్వ ప్రతినిధిగా గుడివాడ అమర్ నాధ్ వ్యవహరిస్తారు. స్వాగతంతో పాటు.. వీడ్కోలు పలుకుతారు. నేవీ డే లో కూడా రాష్ట్రపతి తో పాటు మంత్రి అమర్నాథ్ దంపతులు పాల్గొంటారు.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలు కాకుండా, అధికారిక కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు రాష్ట్రప్రభుత్వం తరపున స్వాగతం పలకడం సంప్రాదాయంగా వస్తోంది. సాధారణంగా రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారు. ఏదైనా సందర్భంలో ముఖ్యమంత్రికి కుదరనప్పుడు.. ప్రభుత్వం తన ప్రతినిధిగా ఓ మంత్రికి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా కల్పిస్తుంది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చిన సమయంలో అక్కడి ముఖ్యమంత్రికి ప్రధానిని స్వాగతం పలకడం వీలుకాని సమయంలో మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికిన విషయం తెలసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..