Andhra Pradesh: ఆ హామీ నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం.. సీఎం జగన్ సంచలన ప్రకటన..

అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే జనవరి నుంచి రూ.2750గా ఇప్పుడు ఉన్నపెన్షన్‌ను..

Andhra Pradesh: ఆ హామీ నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం.. సీఎం జగన్ సంచలన ప్రకటన..
Cm Jagan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 15, 2023 | 5:37 PM

ఆంధ్రప్రదేశ్ రోండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులను వివరించిన సీఎం అసెంబ్లీ వేదికగా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే రూ.1000 పెన్షన్ ఇచ్చేవారని.. కానీ తమ హయాంలో మాత్రం 64 లక్షల మందికి రూ.2750 చొప్పున పెన్షన్ అందజేస్తున్నట్టు సీఎం తెలిపారు. అలాగే వచ్చే జనవరి నుంచి రూ.2750గా ఇప్పుడు ఉన్నపెన్షన్‌ను రూ.3000 వేలకు పెంచుతామని.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని వైయస్ జగన్ స్పష్టం చేశారు. ఇంకా ఏపీ తరహాలో పెన్షన్, రేషన్ అందిస్తున్న పథకం లేదా విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని.. రేషన్ కార్డుల సంఖ్యను కూడా పెంచి.. రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నామన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ 2009 ఎన్నికలకు ముందు తాము ప్రకటించిన మేనిఫెస్టో హామీలను తమ హయాంలోనే 90 శాతం నెరవేర్చామని.. తాము చేసిన మంచి పనులను ప్రజలకు ఈ సందర్భంగా  వివరిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలను 6 లక్షలకు పెంచామని.. రైతులకు ఉచిత విద్యుత్, ఇన్ ఫుట్ సబ్సిడీ సేవలు అందించామని తెలిపారు. అలాగే వారి నుంచి సకాలంలో ధాన్యం సేకరణ చేశామని.. తమ పాలనలో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు.  45 నెలల పాలనలోనే స్పష్టమైన మార్పు, జగన్ మార్క్ పాలన కనిపిస్తుందని సీఎం అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే విద్యా, వ్యాపార రంగాల గురించి కూడా సవివరంగా ప్రసంగించారు సీఎం జగన్. రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని అసెంబ్లీలో సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో శిథిలమైన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌‌కు ధీటుగా అభివృద్ది చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్స్‌ ఇచ్చామని, 6వ తరగతి నుంచే విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు ఇంటరాక్టివ్ వీడియో లెర్నింగ్ సదుపాయాలు తీసుకువచ్చామని సీఎం జగన్ వివరించారు. ఏపీ 3 ఏళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూఇంగ్ బిజినెస్లో నెంబర్ 1 గా ఉందని.. ఈ విషయం పారిశ్రామిక వేత్తల ఫీడ్ బ్యాక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని సీఎం అన్నారు. 2021-22లో 11.32 శాతం GSDP వృద్ధి రేటుతో దేశంలోనే ఆర్థికాభివృద్ధిలో నెం.1 గా ఆంధ్రప్రదేశ్ ఉండటం గర్వంగా ఉందని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..