APPSC Group1, 2 Notifications: త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు విడుదల.. మారనున్న గ్రూప్స్‌ సిలబస్‌

|

Aug 18, 2023 | 9:54 PM

గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ పూర్తవడంతో త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సవాంగ్‌ సూచించారు. గ్రూప్ 2 పోస్టులు వెయ్యి వరకు ఉండొచ్చని, అలాగే గ్రూప్-1 వంద పైగా ఖాళీలతో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని సవాంగ్‌..

APPSC Group1, 2 Notifications: త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు విడుదల.. మారనున్న గ్రూప్స్‌ సిలబస్‌
APPSC
Follow us on

అమరావతి, ఆగస్టు 18: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌1 తుది ఫలితాలు ఆగస్టు 17న విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది 111 ఉద్యోగాలకు విడుదల చేసిన గ్రూప్‌ 1 పోస్టులకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో ప్రాథమిక, జూన్‌లో మెయన్‌ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆగస్టు మొదటి రెండు వారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులు ఎంపికయ్యారు. స్పోర్ట్సు కోటాలో మిగిలిపోయిన పోస్టును త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెల్పింది. ఇక తాజాగా విడుదలైన గ్రూప్‌-1 ఫలితాల్లో తొలి 3 ర్యాంకులు మహిళా అభ్యర్థులే సాధించడం గమనార్హం. మొదటి ర్యాంకు భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష, రెండో ర్యాంకు భూమిరెడ్డి భవాని, మూడో ర్యాంకు కంబాలకుంట లక్ష్మీప్రసన్న, నాలుగో ర్యాంకర్ కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి, అయిదో ర్యాంకు భానుప్రకాశ్‌రెడ్డి సాధించారు.

త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు

గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ పూర్తవడంతో త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్ గౌతమ్ సవాంగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సవాంగ్‌ సూచించారు. గ్రూప్ 2 పోస్టులు వెయ్యి వరకు ఉండొచ్చని, అలాగే గ్రూప్-1 వంద పైగా ఖాళీలతో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని సవాంగ్‌ తెలిపారు.

సెప్టెంబర్‌లోపు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. గ్రూప్‌-1 కింద 100 పోస్టులు, గ్రూప్‌-2 కింద 1000 పోస్టులు భర్తీ చేస్తామని ఆయన అన్నారు. ఇక తాజాగా ప్రకటించనున్న గ్రూప్స్‌ పరీక్షల సిలబస్‌లోనూ మార్పులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. యూపీఎస్సీ విధానంలోనే ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ కూడా ఉంటుందన్నారు. ఈ ఉద్యోగాల నియామకాలపై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని, నోటిఫికేషన్లలో అన్ని వివరాలు పేర్కొంటామని గౌతమ్‌ సవాంగ్‌ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.