CM Jagan Mohan Reddy: జీ-20 డెలిగేట్స్‌కి గాలా డిన్నర్‌ పార్టీ ఇచ్చిన సీఎం జగన్‌

జీ-20 ప్రతినిధులకు మర్యాదపూర్వక విందిచ్చిన సీఎం జగన్‌... వాళ్ల ముందు ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు.

CM Jagan Mohan Reddy: జీ-20 డెలిగేట్స్‌కి గాలా డిన్నర్‌ పార్టీ ఇచ్చిన సీఎం జగన్‌
Cm Jagan Mohan Reddy
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 29, 2023 | 7:20 AM

విశాఖలో గడిపే ప్రతి సమయం, ప్రతి క్షణం చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. సాగర నగరం ప్రతి ఒక్కరికీ మధురమైన అనుభూతిని మిగుల్చుతుందని అన్నారు. జీ-20 ప్రతినిధులకు మర్యాదపూర్వక విందిచ్చిన సీఎం జగన్‌… వాళ్ల ముందు ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు ఏర్పాటు చేయాలన్నదే తమ ఆలోచన, లక్ష్యం అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 30లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, 22లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామంటూ వివరించారు. ఒక్కోచోట పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు, ఊళ్లే నిర్మాణమవుతున్నాయని జీ-20 డెలిగేట్స్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఈ గృహ సముదాయాలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం, అందుకు మీ నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నట్లు చెప్పారు.

మీ ఆలోచనలు అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీ-20 సదస్సులో చర్చించండి-సలహాలు, సూచనలు ఇవ్వండి అంటూ ప్రతినిధులను కోరారు. సస్టెయిన్‌బుల్‌ పాలసీలతో సరైన మార్గనిర్దేశకత్వం చేయగలిగితే పేదలకు ఇళ్లు సమకూరతాయన్నారు జగన్మోహన్‌రెడ్డి. జీ-20 సమ్మిట్‌లో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ IWG సమావేశాలు జరుగుతున్నాయ్‌. మంగళవారం మొదలైన ఈ సమావేశాలు మరో మూడ్రోజులపాటు సాగనున్నాయ్‌. వన్‌ ఎర్త్‌-వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఫ్యూచర్‌ థీమ్‌తో అనేక సమస్యలపై చర్చించబోతున్నారు ప్రతినిధులు.

ఈ సదస్సుకు జీ20 దేశాలతోపాటు యూరోపియన్‌ కంట్రీస్‌కి చెందిన 57మంది ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఇవాళ, యోగా, మెడిటేషన్‌, పౌష్టికాహార వినియోగంపై చర్చలు ఉంటాయ్‌, అలాగే మౌలిక సదుపాయాల కల్పనపైనా డిస్కషన్స్‌ చేస్తారు ప్రతనిధులు. రేపు… స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌, వేస్టే మేనేజ్‌మెంట్‌ అండ్ ఎనర్జీపై క్షేత్రస్థాయిలో వర్క్‌షాపు నిర్వహిస్తారు. ఇక చివరి రోజు పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనపై చర్చిస్తారు డెలిగేట్స్‌. సాగర తీరంలో జరుగుతోన్న జీ-20 సదస్సుతో విశాఖకు ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే, ఏపీకి పెట్టుబడులు కూడా వస్తాయని భావిస్తోంది. మరి, ఆంధ్రప్రదేశ్‌ ఆశిస్తోన్న లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.